వామ్మో.. ఎంత పెద్ద నాగుపామో.. ఒట్టి చేతులతో పట్టుకున్నాడుగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్...

సాధారణంగా చిన్న పామును చూస్తేనే ఒంట్లోనే వణుకు పుడుతుంది.అది దగ్గరికి వస్తుంటే ఎవరైనా సరే హడలెత్తిపోతున్నారు.

 How Bigcobra Snake Holding It With Bare Hands Tears Viral Video , Viral Latest , Viral News , Social Media , Viral Video , Big Snake , Cobea Snake , 20 Minites , 10kgs Snake , Wildlife Rescue ,sue Nouhad-TeluguStop.com

అంతేకాదు, దానికి దూరంగా ఉరుకులు పరుగులు తీస్తుంటారు.అలాంటిది దాదాపు 15 అడుగుల తాచుపాము కనిపిస్తే పైప్రాణాలు పైనే పోతాయి కదూ.కానీ ఒక వ్యక్తి ఒట్టి చేతులతో 4.5 మీటర్లు, 10 కిలోగ్రాముల బరువు కలిగిన పెద్ద పాముని పట్టుకోగలిగారు.దీని పట్టుకోవడానికి ఏకంగా 20 నిమిషాల సమయం పట్టింది అంటే అతడి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటన దక్షిణ థాయ్‌లోని క్రాబి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే థాయిలాండ్ దేశంలోని క్రాబీ ప్రావిన్స్ లోని ఒక తోటలోకి పెద్ద కాలనాగు చొరబడింది.ఇది బుసలు కొడుతూ స్థానికుల్లో హడలు పుట్టించింది.అయితే దీన్ని చూడగానే స్థానికులు వెంటనే పాములు పట్టే వైల్డ్‌లైఫ్‌ రెస్క్యూ టీం ని పిలిచారు.అప్పుడే సూ నౌహాడ్ (40) అనే స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగాడు.

 వామ్మో.. ఎంత పెద్ద నాగుపామో.. ఒట్టి చేతులతో పట్టుకున్నాడుగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్#8230;-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చూసేందుకు చాలా అమాయకంగా, సాధారణంగా కనిపించిన నౌహాడ్… సెప్టిక్ ట్యాంక్‌లో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్న 14 అడుగుల పాముని ఈజీగా బయటకు తెచ్చాడు.దాని తోక పట్టుకొని ఆటబొమ్మ లాగా ఆడుకున్నాడు.

కనీసం చేతిలో ఎలాంటి కర్ర సహాయం లేకుండా అతడు ఇంత పెద్ద పాముని పట్టుకుంటుంటే స్థానికులు ఊపిరి బిగబట్టి మరీ ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా వీక్షించారు.ఈ క్రమంలో పాము కాటు వేయడానికి కూడా ప్రయత్నించింది.

అయినప్పటికీ నౌహాడ్ భయం బెరుకు లేకుండా దాన్ని సునాయాసంగా పట్టుకొని పెద్ద సాహసమే చేశాడు.ఆ తర్వాత దాన్ని అడవుల్లో విడిచిపెట్టాడు.దీనికి సంబంధించిన వీడియోని స్థానికులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.కాగా ఇప్పుడది అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో వైరల్ గా మారింది.

వీడియోపై మీరూ ఓ లుక్కేయ అయితే, తనకు పాములు పట్టడంలో ఎంతో నైపుణ్యం ఉందని.ఎవరూ కూడా తనలాగా ఏ సాయం లేకుండా పాములను పట్టడానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube