వారంలో పిగ్మెంటేషన్ సమస్యకు పరిష్కారం... బెస్ట్ చిట్కా

ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ సమస్య అధికంగా ఉంది.ముఖం మీద మృత కణాలు పేరుకుపోవడం వలన ఈ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది.

చర్మంపై మృత కణాలు తొలగిపోయి ముఖం మిల మిల మెరవటానికి ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం.

ముఖ చర్మపైనా మృత కణాలు ఉండుట వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది.చర్మ కణాలలో చైతన్యం వచ్చి చర్మం తెల్లగా మారాలంటే ఈ చిట్కా బాగా సహాయపడుతుంది.

మనం ఈ చిట్కాలో ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకు అందుబాటులో ఉండేవే.ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు.

ఈ చిట్కాకు కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.మొదటి ఇంగ్రిడియన్ గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను.

నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఆశ్చర్య కరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండుట వలన పిగ్మెంటేషన్ తొలగించటంలో సహాయపడుతుంది.

నేను ఒక స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను.రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను.

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన చర్మానికి పోషణను ఇవ్వటమే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది.

అలాగే చర్మ రంద్రాలు తెరుచుకోవటానికి సహాయపడుతుంది.ఇక్కడ అరస్పూన్ బాదం నూనెను తీసుకున్నాను.

!--nextpage మూడో ఇంగ్రిడియన్ గా కేరట్ తీసుకున్నాను.కేరెట్ లో చర్మాన్ని సంరక్షించే లక్షణాలు ఎన్నో ఉన్నాయి.

విటమిన్ ఎ, సి, క్యాల్షియం మరియు ఐయోడిన్ సమృద్ధిగా ఉండుట వలన మృత కణాలను సమర్ధవంతంగా తొలగిస్తుంది.

క్యారెట్ చాలా చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.నిమ్మ,బాదం మిశ్రమంలో క్యారెట్ ముక్కలు బాగా కలిసేలా కలపాలి.

బాగా కలిసాక క్యారెట్ ముక్కను తీసుకోని ముఖంపై రుద్దాలి.ఇలా ముఖం అంతా రుద్దాలి.

ఒక అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ముఖం మీద పిగ్మెంటేషన్ తొలగిపోయి తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది.

ఈ మార్పు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి పిగ్మెంటేషన్ సమస్య నుండి బయట పడి తెల్లని కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!