జ్ఞాన దంతం నొప్పిని నిమిషంలో తగ్గించే సులభమైన ఇంటి చిట్కాలు  

Home Remedies For Wisdom Tooth Pain -

జ్ఞాన దంతం నొప్పి ఎంత బాధాకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.సాధారణంగా ఈ సమస్య 17 నుండి 25 సంవత్సరాల వయస్సు వారిలో కనపడుతుంది.

జ్ఞాన దంతం ఏర్పడటానికి తగినంత స్థలం లేకపోవటంతో జ్ఞాన దంతం వచ్చే సమయంలో విపరీతమైన నొప్పి, చిగుర్లు వాచిపోవడం, కొద్దిగా జ్వరం రావడం మరియు నోరు తెరిచేటప్పుడు మరియు దేనినైనా మింగేటప్పుడు సమస్యలు వస్తాయి.నొప్పి కొద్దిగా మాత్రమే ఉంటే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు.

Home Remedies For Wisdom Tooth Pain-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అదే కాస్త నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అశ్రద్ద చేయవద్దు.అయితే ఇప్పుడు ఇంటి చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి నూనె
జ్ఞాన దంతం నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల కారణముగా చిగుళ్ల మంట మరియు వాపు రాకుండా చేస్తుంది.

ఒక స్పూన్ కొబ్బరి నూనె నోటిలో వేసుకొని 20 నిమిషాల పాటు బాగా పుక్కలించి బయటకు ఊసేయండి.ఈ విధంగా చేసిన తర్వాత మీ నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోండి.

లవంగం
జ్ఞాన దంతం నొప్పికి వెంటనే ఉపశమనం కలిగించడంలో లవంగం బాగా సహాయపడుతుంది.లవంగంలో బాధనివారిని లక్షణాలు,మత్తు లక్షణాలు ఉండుట వలన జ్ఞాన దంతం నొప్పి తొందరగా తగ్గిపోతుంది.

మూడు లవంగాలను నోటిలో ఉంచుకుంటే నొప్పి తగ్గిపోతుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన నొప్పిని తగ్గించటంలో బాగా సహాయాపడుతుంది.

ఒకటి నుండి రెండు వెల్లుల్లిపాయల రెబ్బలను తీసుకొని చితక్కొట్టండి.ఆ ముద్దని మీ జ్ఞాన దంతం దగ్గర పెట్టండి.

అంతే నిమిషాల్లో జ్ఞానదంతం నొప్పి తగ్గిపోతుంది.

ఉప్పు
జ్ఞాన దంతం నొప్పిని తగ్గించటానికి ఉప్పు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

జ్ఞానదంతం కారణంగా వచ్చే చిగుళ్ల ప్రాంతంలో కలిగే మంటని మరియు ఇన్ ఫెక్షన్స్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.

ఈ విధంగా రోజులో అనేక సార్లు చేస్తూ ఉంటే నొప్పి తగ్గిపోతుంది.

పుదీనా
జ్ఞానదంతం నొప్పి నివారణలో పుదీనాను చాలా ప్రాచీన కాలం నుండి వాడుతున్నారు.

పుదీనాలో మత్తును కలిగించే లక్షణాలు ఉండుట వలన నొప్పిని వెంటనే తగ్గిస్తుంది.పుదీనా ఆకులను నమలాలి.

లేకపోతె పుదీనా పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టినా చాలు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube