భరించలేని తలనొప్పిని చిటికెలో తగ్గించే వంటింటి చిట్కా

Home remedies for headache in Telugu

తలనొప్పి వచ్చిందంటే చాలా చికాకుగా ఉండటమే కాకుండా ఏ పని చేయాలనీ అనిపించదు.తలనొప్పి అనేది ఒత్తిడి,ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచించటం,ఆందోళన వంటి కారణాలతో తలనొప్పి వస్తుంది.

 Home Remedies For Headache In Telugu-TeluguStop.com

యిలా తరచుగా తలనొప్పి వస్తుందా మీకు? అప్పుడు మన ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

అయితే మనలో చాలా మంది తలనొప్పి రాగానే ఇంగ్లిష్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు.

ఈ మందుల కారణంగా తలనొప్పి తగ్గుతుంది.కానీ ఆ మందుల కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందువల్ల తలనొప్పి వచ్చినప్పుడు ఈ చిన్ని చిట్కాలను పాటిస్తే తలనొప్పి తగ్గిపోతుంది.ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

లవంగాలు తలనొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక కప్పు నీటిలో రెండు,మూడు లవంగాలను వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగితే తలనొప్పి తగ్గిపోతుంది.అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడి కలుపుకొని త్రాగిన చాలా అద్భుతంగా పనిచేసి తలనొప్పి తగ్గిపోతుంది.

వెల్లుల్లిలో నొప్పులను తగ్గించే లక్షణాలు ఉన్నాయి.

వెల్లుల్లిలో యాంటీ ఇంఫ్లేమంటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పులను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.వెల్లుల్లి రెబ్బలను తీసుకోని పై పొట్టు తీసేసి మెత్తగా చేసి దానిలో తేనే కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది.

ఉదయం పరగడుపున ఆపిల్ ని ఉప్పుతో కలిపి తీసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తీసుకుంటే తరచూ ఇబ్బంది పెట్టె తలనొప్పి తగ్గిపోతుంది.అయితే ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉండాలి.

జలుబు వచ్చిందంటే తలనొప్పి కూడా వచ్చేస్తుంది.

ఆలా వచ్చిన తలనొప్పి తగ్గాలంటే… ఒక గ్లాస్ నీటిలో ధనియాలు వేసి బాగా మరిగించాలి.ఆ నీటిని వడకట్టి కొంచెం తేనే కలిపి త్రాగితే తలనొప్పి తగ్గటమే కాకుండా జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.

సాధారణంగా తలనొప్పి వచ్చిందంటే అందరూ టీ త్రాగుతూ ఉంటారు.ఆలా టీ త్రాగకుండా ఒక కప్పు నీటిలో మూడు లవంగాలు,రెండు యాలకులు,చిన్న అల్లం ముక్క వేసి మరిగించాలి.ఆ నీటిని వడకట్టి కొంచెం తేనెను కలిపి త్రాగితే తలనొప్పి తగ్గటమే కాకుండా నరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube