ఎన్నో ఇబ్బందులకు గురి చేసే గ్యాస్,ఎసిడిటి సమస్యలు చిటికెలో మాయం కావాలంటే.... బెస్ట్ టిప్స్  

Home Remedies For Gastric Problem -

మారుతున్న బిజీ జీవనశైలి,టైం కి భోజనం చేయకపోవటం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గ్యాస్ సమస్య వేధిస్తుంది.ఈ గ్యాస్ సమస్యను సులభంగా తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి.

ఇంగ్లిష్ మందుల జోలికి అసలు వెళ్ళవలసిన అవసరం లేదు.ఈ ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

Home Remedies For Gastric Problem-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఈ చిట్కాకు అవసరమైనవి అన్నీ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
నీరు
నీటిని ఎక్కువగా త్రాగటం వలన గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.జీర్ణాశయంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది.తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటంతో గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.

బెల్లం
భోజనం అయిన వెంటనే చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకొని చప్పరిస్తే తిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.

పెరుగు
పెరుగులో సన్నగా తరిగిన కీరా దోశ ముక్కలు,కొత్తిమీర కలిపి భోజనం అయ్యాక తీసుకుంటే గ్యాస్,అజీర్ణం సమస్య తొలగిపోవటమే కాకుండా కడుపులో మంట కూడా తగ్గిపోతుంది.

లవంగాలు
భోజనం చేసిన తర్వాత రెండు లేదా మూడు లవంగాలను నోటిలో వేసుకొని చప్పరిస్తే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.

సోంపు
అజీర్ణం,గ్యాస్ సమస్యలను తగ్గించటంలో సోంపు బాగా సహాయపడుతుంది.భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపును తీసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి.

తులసి ఆకులు
తులసి ఆకులలో ఉండే లక్షణాలు జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో బాగా సహాయపడతాయి.తులసి రసంలో తేనే కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య తొలగిపోతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube