మీ పాదాలపై ఆనెకాయలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

ఎవరికైనా పాదాలపై ఆనెకాయలు వస్తే నొప్పితో పాటు చాలా చిరాకు కూడా కలుగుతుంది.అవి నొప్పిని కలిగించటమే కాకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

ఇవి సాధారణంగా కాలివేళ్ళ మధ్యన, మడమల వద్ద ఏర్పడుతూ ఉంటాయి.ఆనెకాయలు వచ్చినప్పుడు గట్టిగా,కఠినంగా మారిపోతుంది.

ఆ ప్రదేశంలో మృత కణాలు బాగా పేరుకుపోవడం వలన ఆనెకాయలు ఏర్పడతాయి.ఆనెకాయలను తగ్గించటానికి మంచి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి.

వాటి గురించి తెలుసుకుందాం.విటమిన్ E ఆయిల్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి ఆ ప్రదేశాన్ని తేమగా ఉంచి ఆనెకాయలను తగ్గించటంలో సహాయపడుతుంది.

రాత్రి సమయంలో ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో విటమిన్ E ఆయిల్ ని రాసి పాదాలను సాక్స్ తో కవర్ చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.!--nextpage ఓట్ మీల్ ఓట్ మీల్ మృతకణాలను తొలగించి ఆనెకాయలను తొలగించటంలో సహాయపడుతుంది.

పాదాలను గోరువెచ్చని నీటిలో 5 నిముషాలు పెట్టి ఉడికించిన ఓట్ మీల్ ను ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల పాటు రుద్దాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారానికి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బాదం నూనె బాదం నూనె చర్మంలోకి బాగా ఇంకి మృతకణాలను తొలగిస్తుంది.దాంతో ఆనెకాయల సమస్య తగ్గుతుంది.

రాత్రి సమయంలో ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో బాదం ఆయిల్ ని రాసి పాదాలను సాక్స్ తో కవర్ చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఆలోవెరా జెల్ ఆలోవెరా జెల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన పాదాలపై వచ్చే ఆనెకాయలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

ఆలోవెరా జెల్ ను ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం తొందరగా కనపడుతుంది.ఉల్లిపాయ ఉల్లిపాయలో ఉండే ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్లు చర్మంపై మురికిని తొలగించి, మీ పాదాలపై గట్టి, కఠినమైన చర్మాన్ని మెత్తగా మార్చి ఆనెకాయలను తగ్గించటంలో బాగా సహాయపడతాయి.

ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో 4 రసాన్ని వేయాలి.

ఈ టబ్ లో పాదాలను పెట్టి 15 నిముషాలు అయ్యాక పాదాలను శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ క్రీమ్ రాయాలి.

ఈ చిట్కాను వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

నిత్యం కడుపు ఉబ్బరంగా ఉండడానికి ముఖ్యమైన కారణలు ఇవే..!