ఉలిక్కిపడ్డ అగ్ర రాజ్యం...న్యూయార్క్ లో హై అలెర్ట్...కీలక ఆదేశాలు జారీ చేసిన బిడెన్...!!

కరోనా మహమ్మారి పుట్టింది చైనాలో అయినా ఉరుకులు పరుగులు పెట్టించింది మాత్రం అగ్ర రాజ్యం అమెరికానే.అమెరికాలో కరోనా ప్రభావం గతంలో అక్కడ ఏ విపత్తుల కారణంగా రాలేదని ఒక్క కరోనా కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ నేటికి స్థిరత్వానికి చేరుకోలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 High Alert In New York . Biden Issuing Key Orders, Joe Biden, America , New York, High Alert , Corona, Booster Dose, Vacination , Dr. Ashwin, Covid Rules-TeluguStop.com

అంటే ఏ స్థాయిలో మహమ్మారి అమెరికాపై ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.అయితే క్రమంగా కరోనాపై పై చేయి సాధించామని ప్రస్తుతానికి కరోనా ప్రభావం అమెరికాపై తగ్గిందని ప్రకటించిన అమెరికాకు కరోనా మళ్ళీ షాక్ ఇచ్చింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఊహించని విధంగా మహమ్మారి ప్రభావం చూపడంతో మళ్ళీ అగ్ర రాజ్యం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.అమెరికాలోనే అతిపెద్ద నగరం కావడంతో అక్కడ కరోనా ప్రభావం మొదలైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన బిడెన్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న అధికారులను అలెర్ట్ చేసింది.

 ఉలిక్కిపడ్డ అగ్ర రాజ్యం#8230;న్యూయార్క్ లో హై అలెర్ట్#8230;కీలక ఆదేశాలు జారీ చేసిన బిడెన్#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రజలను బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా చిన్న పిల్లలను, వ్రుద్దులను బయటకు తీసుకురావద్దంటూ హెచ్చరించింది.

అంతేకాదు.

న్యూయార్క్ లో బహిరంగ ప్రదేశాలలో తిరగే వారు ఎవరైనా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది.ఇప్పటికి వ్యాక్సిన్ వేసుకొని వారు వ్యాక్సిన్ వేసుకోవాలని, అలాగే బూస్టర్ డోస్ తీసుకొని వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.న్యూయార్క్ లోని పరిస్థితులపై అలెర్ట్ అయిన అక్కడి హెల్త్ కమిషనర్ డాక్టర్ అశ్విన్ మాట్లాడుతూ బయటకి వెళ్ళినపుడు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మనకు మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో వారికి భంధవులకు కరోనా సోకకుండా ఉంటుందని వ్యక్తిగత భద్రత ఎంతో ముఖ్యమని సూచించారు.

ఏప్రియల్ నుంచీ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని ఇప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉందని ప్రజలు నిభందనలు పాటించడం వలన కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని ఆయన ప్రకటించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube