F3 మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

F3 మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘F3’.ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా 2019 లో విడుదలైన F2 సీక్వెల్.ఇక ఇందులో తమన్నా, మెహరీన్, సునీల్, మురళి శర్మ, ప్రగతి, రఘుబాబు తదితరులు నటించారు.డీఎస్పీ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.

 F3 మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంట-TeluguStop.com

కథ:

కథ విషయానికి వస్తే.ఈ సినిమా డబ్బు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.లోకంలో పంచభూతాలతో పాటు డబ్బు అనే కోణం ఉంటుంది అన్నట్లుగా ఈ సినిమాను ప్రారంభించారు.ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ లలో ఒకరు రేచీకటి తో, మరొకరు నత్తితో బాధపడతారు.ఇక వీరికి భార్యలుగా తమన్నా, మెహరీన్ నటించారు.

దీంతో వీరికి డబ్బు మీద చాలా ఆశ ఉంటుంది.ఆ డబ్బుల కోసం వెంకటేష్, వరుణ్ తేజ్ పడే పాట్లు అంతా ఇంతా కాదు.

ఇక వీరికి తమ భార్యలు ఎలాంటి సమస్యలు సృష్టిస్తారు.చివరికి వీరు డబ్బులు ఎలా సంపాదించారు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్, వరుణ్ తమ పాత్రలతో బాగా ఆకట్టుకున్నారు.అంతేకాకుండా తమ కామెడీతో కూడా బాగా నవ్వించారు.

వీరితో పాటు తమన్నా, మెహరీన్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.మిగతా నటీనటులు కూడా తమ పాత్రలలో లీనమయ్యారు.

స్పెషల్ ఎంట్రీ తో తమన్నా బాగా హైలెట్ గా నిలిచింది.

Anil, Anil Ravipudi, Review, Story, Mehreen, Murali Sharma, Sonal Chouhan, Sunee

టెక్నికల్:

టెక్నికల్ పరంగా.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు పూర్తిగా కామెడీని అందించాడు.పూర్తి కామెడీ తో ఈ సినిమా తెరకెక్కగా కథ లేనట్టుగా అనిపించింది.

ఇక సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.కానీ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మాత్రం అసలు ఆకట్టుకోలేకపోయింది.ఎడిటింగ్ తో తో పాటు మిగతా సాంకేతిక విభాగాలు పర్వాలేదు.

విశ్లేషణ:

ఇక ఈ సినిమాలో పూర్తి కామెడీ గా ఉన్నా కూడా ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయి.ఇక వెంకటేష్ కామెడీ స్థాయి ఎక్కువగా ఉంది.చాలా వరకూ చాలా మంది నటీనటులను తీసుకున్న కూడా వారి పాత్రలకు అంతగా సెట్ అవ్వలేదు అన్నట్లు గా అనిపించింది.

దీనికంటే ఎఫ్ 2 బెటర్ అన్నట్లుగా ఉంది.

Anil, Anil Ravipudi, Review, Story, Mehreen, Murali Sharma, Sonal Chouhan, Sunee

ప్లస్ పాయింట్స్:

వెంకటేష్, వరుణ్ తేజ్ నటన, కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ లో కాస్త సాగదీసినట్లుగా అనిపించింది.సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

క్లైమాక్స్ లో కాస్త మార్పులు ఉంటే బాగుండేది.కామెడీతో పాటు కథ కూడా ఉంటే బాగుండేది.

Anil, Anil Ravipudi, Review, Story, Mehreen, Murali Sharma, Sonal Chouhan, Sunee

బాటమ్ లైన్:

ఈ సినిమా మొత్తం కామెడీ కాన్సెప్ట్ తో మాత్రమే తెరకెక్కింది.దీంతో కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఇష్టపడతారు.కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం సరిపోదు.కాబట్టి ఎక్కువ స్థాయిలో ఊహించకుండా కామెడీ పరంగా మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube