రాజశేఖర్ భార్య జీవిత నిజస్వరూపం ఇదే.. ఆమె ఇలా మోసం చేసిందంటూ?

రాజశేఖర్ హీరోగా జీవిత డైరెక్షన్ లో 7 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శేఖర్ మూవీ ప్రదర్శన ఆగిపోయిన సంగతి తెలిసిందే.65 లక్షల రూపాయలను కోర్టులో సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా జీవిత, రాజశేఖర్ ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.అయితే ఈ సినిమా ప్రదర్శన ఆగిపోవడానికి కారణమైన పరంధామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Rajasekhar Wife Jeevitha Real Behavior Details, Rajasekhar, Jeevitha, Sekhar Movie, Parandhami Reddy, Mahankali Movie, Film Chamber, City Civil Court, Jeevita Rajasekhar, 65 Lakh Rupees-TeluguStop.com

రెండున్నర సంవత్సరాల క్రితం జీవితకు 65 లక్షల రూపాయలు ఇచ్చానని శేఖర్ రిలీజ్ లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తానని జీవిత చెప్పిందని ఆయన తెలిపారు.

మా ఇంటి పక్కనే జీవిత ఇల్లు అని డబ్బుల కోసం పదిసార్లు వాళ్ల ఇంటికి తిరిగానని ఆమె ఉలకదు పలకదు అని పరంధామిరెడ్డి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టులో నా దగ్గర ఉన్న రికార్డులతో కేసు ఫైల్ చేశానని సిటీ సివిల్ కోర్టు 65 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.

 రాజశేఖర్ భార్య జీవిత నిజస్వరూపం ఇదే.. ఆమె ఇలా మోసం చేసిందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజశేఖర్ తో మహంకాళి అనే సినిమాను తాను నిర్మించానని ఆయన వెల్లడించారు.

జీవిత 65 లక్షల రూపాయల డబ్బు గురించి అస్సలు చెప్పడం లేదని ఆయన తెలిపారు.తర్వాత ఇస్తానని చెబుతూ ఆమె పోస్ట్ పోన్ చేస్తుందని డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టే టెంపర్ మెంట్ ఆమెదని పరంధామిరెడ్డి అన్నారు.మహంకాళి సినిమాతో నాకు నష్టాలు మిగిలాయని ఆయన చెప్పుకొచ్చారు.

శేఖర్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని బ్రహ్మాండమైన బెనిఫిట్ ఇస్తానని ఆమె చెప్పారని పరంధామిరెడ్డి వెల్లడించారు.

సినిమా రిలీజ్ కాకముందే తాను కోర్టులో కేసు వేశానని అయితే కోర్టు తీర్పు ఆలస్యంగా వచ్చిందని పరంధామిరెడ్డి అన్నారు.65 లక్షలకు వడ్డీతో కలిపి 87 లక్షలు అయిందని పరంధామిరెడ్డి చెప్పుకొచ్చారు.రాజశేఖర్ కూడా నాతో మాట్లాడటం లేదని ఆయన పేర్కొన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ ఏం చేయదని అందుకే కోర్టుకు వెళ్లానని డబ్బులు ఇస్తే కేసు విత్ డ్రా చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు.జీవిత తత్వం నాకు తెలుసని ఆయన అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube