దానిమ్మపండుతో ఎన్ని లాభాలో

దానిమ్మపండు తినడానికి ఇష్టంగా ఉన్నా, ఆ తోలంతా ఒలిచి తినడం కష్టంగానే ఉంటుంది.అయినా దానిమ్మపండు తినండి.

దానితో వచ్చే లాభాలు అన్ని ఇన్ని కాదు.* హైబిపి సమస్యలతో బాధపడేవారికి దానిమ్మపండు మేలు చేస్తుంది.

కొలస్ట్రాల్ తో పాటు బిపి తగ్గించడం దీని ప్రత్యేకత.* గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా దానిమ్మను తింటూ ఉండాలి.

దీనిలో ఉండే పోలిఫెనాల్స్ మీ గుండెని సురక్షితంగా ఉంచుతాయి.* అంగస్తంభన సమస్యను ఎదురుకుంటున్న మగవారు దానిమ్మను ఆశ్రయించాలి.

Advertisement

ఇది టెస్టోస్టిరోన్ లెవెల్స్ ను పెంచి అంగం గట్టిపడటానికి తోడ్పడుతుంది.ఇది వీర్యకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

* విటమిన్ C దానిమ్మలో బాగా లభిస్తుంది.ఇది మీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

* బాడికి ఫైబర్ ఎంతో అవసరం.మీరు రోజుకి ఒక్క దానిమ్మ అయినా తినడానికి ప్రయత్నించండి.

అదే రెండు తింటే ఇంకా మంచిది.ఒక్క దానిమ్మ మీ శరీరానికి కావాల్సిన 45% ఫైబర్ ని అందజేస్తుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!...
ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!...

* జీర్ణశక్తి ని బాగా పెంచే సాధనం ఈ దానిమ్మ.తెలియనివారు సోడాని ఆశ్రయిస్తారు.

Advertisement

దాని బదులు దానిమ్మ తినండి.* రోజు దానిమ్మ తినే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* క్వీన్ మార్గరెట్‌ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం, దానిమ్మ స్ట్రెస్ ని కూడా పోగొడుతుంది.శారీరకంగా కాని, మానసికంగా కాని అలసిపోతే దానిమ్మ మీకు మంచి నేస్తంగా మారుతుంది.

తాజా వార్తలు