దానిమ్మపండుతో ఎన్ని లాభాలో

Healthy benefits of Pomegranates

దానిమ్మపండు తినడానికి ఇష్టంగా ఉన్నా, ఆ తోలంతా ఒలిచి తినడం కష్టంగానే ఉంటుంది.అయినా దానిమ్మపండు తినండి.

 Healthy Benefits Of Pomegranates-TeluguStop.com

దానితో వచ్చే లాభాలు అన్ని ఇన్ని కాదు.

* హైబిపి సమస్యలతో బాధపడేవారికి దానిమ్మపండు మేలు చేస్తుంది.

కొలస్ట్రాల్ తో పాటు బిపి తగ్గించడం దీని ప్రత్యేకత.

* గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా దానిమ్మను తింటూ ఉండాలి.

దీనిలో ఉండే పోలిఫెనాల్స్ మీ గుండెని సురక్షితంగా ఉంచుతాయి.

* అంగస్తంభన సమస్యను ఎదురుకుంటున్న మగవారు దానిమ్మను ఆశ్రయించాలి.

ఇది టెస్టోస్టిరోన్ లెవెల్స్ ను పెంచి అంగం గట్టిపడటానికి తోడ్పడుతుంది.ఇది వీర్యకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

* విటమిన్ C దానిమ్మలో బాగా లభిస్తుంది.ఇది మీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

* బాడికి ఫైబర్ ఎంతో అవసరం.మీరు రోజుకి ఒక్క దానిమ్మ అయినా తినడానికి ప్రయత్నించండి.

అదే రెండు తింటే ఇంకా మంచిది.ఒక్క దానిమ్మ మీ శరీరానికి కావాల్సిన 45% ఫైబర్ ని అందజేస్తుంది.

* జీర్ణశక్తి ని బాగా పెంచే సాధనం ఈ దానిమ్మ.తెలియనివారు సోడాని ఆశ్రయిస్తారు.

దాని బదులు దానిమ్మ తినండి.

* రోజు దానిమ్మ తినే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* క్వీన్ మార్గరెట్‌ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం, దానిమ్మ స్ట్రెస్ ని కూడా పోగొడుతుంది.శారీరకంగా కాని, మానసికంగా కాని అలసిపోతే దానిమ్మ మీకు మంచి నేస్తంగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube