చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు... తీసినా కానీ మ్యాచ్ గెలవలేకపోయారు...

చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు… తీసినా కానీ మ్యాచ్ గెలవలేకపోయారు..

క్రికెట్….ఈ ఆటకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.క్రికెట్ ఆడుతున్నారంటే నిద్రహారాలు మానేశే వీరాభిమానులు కూడా ఉన్నారు.ఇలానే ఆటను చూసుకుంటూ ఆ మత్తులో తేలిపోతూ ఉంటారు.అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్ లు పుట్టుకొచ్చాయి.వాటిల్లో అనేకం సక్సెస్ అయ్యాయి.

 Hat-trick Of Wickets In The Last Over . But Could Not Win The Match  Cricket, Vi-TeluguStop.com

ఇలా కొన్ని రకాల క్రికెట్ లీగ్ లు ఆ దేశ క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.ప్రస్తుతం వన్డేలు, టెస్టుల కన్నా ఎక్కువగా టీ20 మ్యాచులనే చూస్తున్నారు.టీ20 ల్లో ఉండే మజాయే వేరని చాలా మంది చెబుతారు.వచ్చిన అనతి కాలంలో టీ20లు ప్రజాధరణను చూరగొన్నాయి.

ఇలా టీ20లు ప్రస్తుతం కేవలం ఇంటర్నేషనల్ మ్యాచులనే కాకుండా లీగ్ లు, అనేక అనామక లీగుల్లో కూడా ఆడిస్తున్నారు.ఇక ఇప్పుడు ఇలాంటి అనామక లీగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ క్రికెట్ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలు గా కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

ఓ చోట అనామక లీగ్ మ్యాచ్ జరుగుతుంది.మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విధించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో రెండో బ్యాటింగ్ జట్టుకు చివరి ఓవర్లో 7 పరుగులు కావాలి.టీ20ల్లో ఆరు బంతుల్లో ఏడు పరుగులంటే రెండో బ్యాటింగ్ చేసే జట్టే సులువుగా గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు.

కానీ అక్కడే ఓ అసలైన ట్విస్ట్ ఉంది.ఇక ఈ ఓవర్ ను వేసిన బౌలర్ మొదటి బంతికి పరుగేమీ ఇవ్వలేదు.రెండు, మూడు, నాలుగు బంతులకు వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.ఇక ఐదో బంతికి బ్యాట్స్ మెన్ ఒక పరుగు తీశాడు.దీంతో సమీకరణం కాస్త ఒక్క బంతిలో ఆరు పరుగులుగా మారిపోయింది.ఆ చివరి బంతికి బ్యాట్స్ మెన్ సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube