జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే...బెస్ట్ టిప్

ఈ రోజుల్లో మారిన జీవన శైలి,బిజీ షెడ్యూల్, కాలుష్యం,ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది.ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవలసిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ఒక వారం రోజుల్లోనే జుట్టు రాలే సమస్య తగ్గటాన్ని గమనించి మీరు ఆశ్చర్య పోతారు.

ఈ చిట్కాకు కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.కావలసిన వస్తువులు బాదం ఆయిల్ - 1 స్పూన్ నిమ్మరసం - 1 స్పూన్ మొదటి ఇంగ్రిడియన్ గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను.

నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టుకు ఆశ్చర్య కరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది.

నేను ఒక స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను.రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను.

బాదం నూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలు అధికంగా ఉండుట వలన తల మీద చర్మానికి పోషణను ఇచ్చి జట్టు కుదుళ్లను బలపరచి జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.

ఇక్కడ అరస్పూన్ బాదం నూనెను తీసుకున్నాను.ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోని దానిలో అరస్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసేలా కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

మసాజ్ చేసాక అరగంట ఆలా వదిలేయాలి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

రాజీనామా లేఖను తీసుకొని వస్తారా.? సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో సవాల్..!!