గూగుల్ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని భాషలను ట్రాన్స్‌లేట్ చేసేస్తుంది!

గూగుల్ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని భాషలను ట్రాన్స్‌లేట్ చేసేస్తుంది!

టెక్ దిగ్గజం గూగుల్ లైవ్ సబ్ టైటిల్స్ అందించే గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ అనే ఒక సరికొత్త ప్రొడక్టును లాంచ్ చేయడానికి రెడీ అయింది.సాధారణంగా మనం ఏదైనా ఇతర భాషలో సినిమా చూస్తున్నప్పుడు క్యారెక్టర్లు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి మనకు అర్థమయ్యే భాషలో సబ్ టైటిల్స్ ఉపయోగిస్తాం.

 Google Smart Glasses Translates All Languages Google Glass, Technology Updates,-TeluguStop.com

సబ్ టైటిల్స్ సహాయంతో వాళ్లేం మాట్లాడుతున్నారనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం.అయితే రియల్ వరల్డ్ లో కూడా మనుషులు మాట్లాడే మాటలను మనకు అర్థమయ్యే భాషలో లైవ్ సబ్ టైటిల్స్ అందించడానికి గూగుల్ సిద్ధమయ్యింది.

గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ ఇతరులు మాట్లాడే మాటలను లైన్ లో మనకు అర్థమయ్యే భాషలో సబ్ టైటిల్స్ ప్లే చేస్తుంది.ఎవరైనా ఇంగ్లీష్ వ్యక్తి మన ముందు మాట్లాడుతుంటే… ఆ మాటలను గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ తెలుగులో అనువదించి మరీ చూపిస్తుంది.

దీనివల్ల మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా వారు మాట్లాడే మాటలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు.కాకపోతే తిరిగి సమాధానం ఇవ్వాలంటే కష్టం.ఒకవేళ అవతలి వ్యక్తి కూడా గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ ధరించినట్లయితే మన భాషలో మనం మాట్లాడితే వారు కూడా అర్థం చేసుకోగలుగుతారు.అలా కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది.

Languages, Google Glass, Latest, Ups-Latest News - Telugu

దీని పనితీరుకు సంబంధించిన వీడియోను కూడా గూగుల్ యూట్యూబ్ లో షేర్ చేసింది.గూగుల్ స్మార్ట్ గ్లాసెస్ లో ప్రాసెసర్, బ్యాటరీ, వైర్‌లెస్ రేడియోలు, ఇతర హార్డ్‌వేర్ భాగాలు ఉంటాయి.ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలోనే ఉన్న ఈ గ్లాసెస్ కొన్ని సంవత్సరాల్లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదే జరిగితే ఎవరూ కూడా సమయం వెచ్చించి మరీ ఇంగ్లీష్ వంటి ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం రాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube