నోటి దురద : చిక్కుల్లో మాజీ మంత్రి అవంతి ? పోలీస్ కేసు నమోదు !

నోటి దురద : చిక్కుల్లో మాజీ మంత్రి అవంతి ? పోలీస్ కేసు నమోదు !

బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తమ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి.ముఖ్యంగా జనాలతో సత్సంబంధాలు కలిగి, అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఈ విషయంలో మరింత జాగ్రత్త పడకపోతే రాజకీయంగా తీరని నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 Former Minister Avanti In Trouble Police Case Registered , Avanthi Srinivas, Ysr-TeluguStop.com

ఇప్పుడు అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.

ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అవంతి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ పోలీస్ కమిషనర్ కు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది.దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రసీదు కూడా అందజేశారు.

Jagan, Raithubharosa, Ysrcp, Ysrcpavanthi-Political

వివరాల్లోకి వెళితే ఇటీవల పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా బహిరంగ సభ జరిగింది.ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సభా వేదిక ముందు ఆందోళనకు దిగారు.దీనిపై ఆగ్రహం చెందిన అవంతి శ్రీనివాస్ సదరు వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ మాట్లాడడం పైనే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.ఈ ఘటన మే 16న విశాఖ జిల్లా పద్మనాభం మండలం గ్రామంలో రైతు భరోసా సభలో జరిగింది.

ఈ సభలో పాల్గొన్న అవంతి శ్రీనివాస్ సదరు వ్యక్తిని ఉద్దేశిస్తూ పంతులు నీ అంతు చూస్తా అంటూ మాట్లాడినట్లుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అవంతి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ వ్యవహారం రాజకీయ రచ్చ గా మారింది.వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ మధ్యకాలంలో అనేక వివాదాల్లో చిక్కుకుంటూన ప్రజల్లో చులకన అవుతున్నారు .ఇదే సమయంలో విశాఖ జిల్లాలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ పైన కేసు నమోదు కావడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube