బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్

హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది.నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేళలో రాష్ట్ర అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది.

 Flexi War Between Bjp And Trs  Bjp ,  Trs , Ts Poltics , Kcr , Modi, Bandi Sanja-TeluguStop.com

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సమావేశాలు గనుక కోలాహలం తప్పనిసరిగా ఉంటుంది.ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

ప్రధాని మోడీ రెండు రోజుల పాటు నగరంలోనే బస చేస్తారు.మూడో తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది.

దీంతో సహజంగా బీజేపికి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు నగరమంతటా ఏర్పాటు చేసుకుంటారు.ఏ పార్టీ సభ జరిగినా ప్రచారం తప్పనిసరిగా జరుగుతుంది.

ఇదిలాఉంటే.పరేడ్ మైదానం చుట్టూ మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ.అలాగే నగరంలో అనేక చోట్ల కూడా మోడీ వ్యతిరేక పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.పైగా నగరంలోని హోర్డింగ్సన్నీ టీఆర్ఎస్ బుక్ చేసేసుకుంది.

అడ్డర్టైజ్ మెంట్ ఏజెన్సీలను బీజేపీ సంప్రదిస్తే ఎక్కడా ఖాళీలు లేవని సమాధానం వస్తోంది.దీంతో నగరమంతా పార్టీ జెండాలతో నింపాలని బీజేపీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు.

కూడళ్ళలో వీలున్న చోట పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.నాలుగు రోజుల క్రితం బీజేపీ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు సాలు దొర.సెలవు దొర అంటూ కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Bandi Sanjay, Jp Nadda, Modi, Trs Bjp, Ts Poltics-Political

హైదరాబాద్ నగరంలో కారు, కమలం మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది.కొద్ది రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేతలు నిర్వహించనున్నారు.జూలై 3 తేదీన పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే బీజేపీ ఆఫీస్ ముందు సాలు దొర, సెలవు దొర అంటూ కేసీఆర్ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.దీనికి కౌంటర్ గా మోడీ మీద టీఆర్ఎస్ ఫ్లెక్సీలు హైదరాబాద్ నగరంలో రోడ్లపై పెట్టారు.

బీజేపీ సభ ప్రచారానికి వీల్లేకుండా గులాబీ పార్టీ కుయుక్తులు.నగరంలోని హోర్డింగ్సన్నీ బుక్ చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నేతలు.

టీఆర్ఎస్ కు అవసరం లేకున్నా నగరమంతా పోస్టర్లు.హోర్డింగ్స్ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో నగరమంతా బీజేపీ జెండాలతో అలంకరిస్తున్నాయి.

అయితే ఈ పథ్యంలో మోడీ వ్యతిరేక పోస్టర్లు పోలీసులు తొలగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube