పుట్టగొడుగుల‌కూ మ‌నుషుల్లాంటి ఫీలింగ్స్‌

పుట్టగొడుగుల‌కూ మ‌నుషుల్లాంటి ఫీలింగ్స్‌

చెట్లకు, మొక్కలకు ప్రాణం ఉంటుందని అవి కూడా మనుషుల్లాగే బాధను అనుభవిస్తాయనే మాట వింటుంటాం.కానీ పుట్టగొడుగులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయ‌ని మీకు తెలుసా? ఇంగ్లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పుట్టగొడుగులు కూడా మనుషుల్లాగే మాట్లాడతాయని తేలింది.ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ అడమట్జ్కీ ఈ పరిశోధనలో 4 జాతుల పుట్టగొడుగుల కార్యకలాపాలను అధ్యయనం చేశారు.ఈ 4 జాతులలో ఎనోకి, స్ప్లిట్ గిల్, గొంగళి పురుగు శిలీంధ్రాలు ఉన్నాయి.

 Feelings Of Being Human To Mushrooms  , Professor Andrew Adamatzky, England, Roy-TeluguStop.com

ఎలక్ట్రిక్ యాక్టివిటీ ప్యాటర్న్‌ని విశ్లేషించడం ద్వారా పరిశోధన చేశారు.వాటికి మెదడు, స్పృహ రెండూ ఉన్నాయ‌ని తెలిపారు.

ఆండ్రూ తెలిపిన వివ‌రాల ప్రకారం పుట్టగొడుగుల యొక్క విద్యుత్ ప్రేరణలు మానవ భాషని పోలి ఉంటాయి.వాటికి 50 పదాల నిఘంటువు ఉంది.

కానీ అవి వాటిలో 15 నుండి 20 పదాలను మాత్రమే ఉపయోగిస్తాయి.

పుట్టగొడుగులు వాతావరణం మరియు రాబోయే ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తాయని, అలాగే పుట్టగొడుగులు తమ బాధను ఒకదానికొకటి తెలియజేస్తాయని కూడా అధ్యయనంలో వెల్ల‌డ‌య్యింది.

ప్రొఫెసర్ ఆండ్రూ అడమట్జ్కీ, రాయల్ సొసైటీ ‘ఓపెన్ సైన్స్’లో ప్రచురించిన పరిశోధనలో, పుట్ట‌గొడుగుల స్పంద‌న‌కు మానవుల భాషకు మధ్య సంబంధం ఉందో లేదో తెలియదు కానీ అవి ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయ‌ని తెలిపారు.అదే సమయంలో శాస్త్రవేత్తలు దీనిని పూర్తిగా అంగీకరించ‌లేదు.

విద్యుత్ ప్రేరణలను ఒక భాషగా పరిగణించడం చాలా తొందరపాటు చ‌ర్య అని, దీనిపై మరింత పరిశోధన అవసరమని ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube