సాయిపల్లవి ఫోటో పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని.. వైరల్ ఫోటో!

సాయిపల్లవి ఫోటో పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని.. వైరల్ ఫోటో!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.నిజానికి వీరు అంటే పడిచచ్చే వీరాభిమానులు ఉంటారు.

 Fan Got A Sai Pallavi Face Tattoo Photo Goes Viral Details, Sai Pallavi, Tollywood, Fan, Tatoo, Photo Viral, Sai Pallavi Fan, Sai Pallavi Tattoo, Natural Beauty Sai Pallavi, Virata Parvam, Heroine Sai Pallavi, Sai Pallavi Face Tattoo, Sai Pallavi Tattoo On Heart, Fidaa Movie-TeluguStop.com

తమ అభిమాన నటీనటుల కోసం అభిమానులు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇక వారికి సంబంధించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తూ థియేటర్ల దగ్గర బాగా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు.

మరికొందరు తమ అభిమాన నటి నటులు కలిస్తే వెంటనే వారిని కలిసేదాకా, వారితో సెల్ఫీలు దిగేదాకా వదలరు.ఇక కొందరు మాత్రం కొన్ని కొన్ని సార్లు కొన్ని సాహసాలు కూడా చేస్తూ ఉంటారు.

 సాయిపల్లవి ఫోటో పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని.. వైరల్ ఫోటో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో రష్మిక మందన కోసం ఓ అభిమాని ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నడిచాడు.అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి ల కోసం కూడా ఎంతోమంది అభిమానులు వారిని కలవడానికి ఎంత దూరమైనా వెనకాడకుండా వచ్చేవారు.

అలా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిమానం చూపిస్తూ ఉంటారు అభిమానులు.ఇక హీరోయిన్ లంటే చాలావరకు అబ్బాయిలు బాగా ఇష్టపడుతూ ఉంటారు.

వారి ఫోటోలను తమ ఇళ్లల్లో, తమ ఫోన్లలో పెట్టుకుంటూ ఉంటారు.కానీ తాజాగా ఓ కుర్రాడు సాయి పల్లవి ఫోటోలు పచ్చబొట్టు పొడిపించుకుని అందరికీ షాకిచ్చాడు.

Fidaa, Sai Pallavi, Naturalsai, Saipallavi, Sai Pallavi Fan, Tatoo, Tollywood, Virata Parvam-Latest News - Telugu

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ పిల్లగా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఎంతో హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకొని కుర్రాళ్ళ హృదయాల్లో నిలిచిపోయింది.

కెరీర్ మొదట్లో ‘ఢీ’ డాన్స్ షోలో పాల్గొని తన డాన్స్ లతో మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా వైద్య విద్య కూడా చేస్తుంది.

మొదట ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయిపల్లవి.ఆ తర్వాత ‘ఫిదా’ సినిమాలో నటించి తనకంటూ మంచి సక్సెస్ అందుకుంది.

అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Fidaa, Sai Pallavi, Naturalsai, Saipallavi, Sai Pallavi Fan, Tatoo, Tollywood, Virata Parvam-Latest News - Telugu

అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు కూడా పంచుకుంటుంది.అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో బాగా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే ఈ నేచురల్ బ్యూటీకి ఉన్నంత ఫాలోయింగ్ మరెవరికీ లేదు.

తాను కనిపిస్తే చాలు తనతో ఫొటోలు దిగడానికి బాగా ఎగబడతారు.

ఇక ఓ నెటిజెన్ తనమీద ఉన్న అభిమానాన్ని చూపించటానికి ఏకంగా తన గుండెల పై తన ఫొటోలు పచ్చబొట్టుగా పెట్టించుకున్నాడు.ఇక ఆ ఫోటో వైరల్ గా మారడంతో అందులో సాయి పల్లవి కూడా అతని పక్కన ఉండే ఫోటో దిగింది.

తన పై ఉన్న అభిమానాన్ని చూసి సంతోషంగా పొంగిపోయింది.ప్రస్తుతం ఆ ఫోటో అందరి దృష్టిలో పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube