ఎఫ్ 3 పక్కా పైసా వసూల్ చిత్రం... అలీ షాకింగ్ కామెంట్స్!

ఎఫ్ 3 పక్కా పైసా వసూల్ చిత్రం… అలీ షాకింగ్ కామెంట్స్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది.

 F3 Pakka Hit Movie Ali Shocking Comments F3, Ali, , Tollywood, Venaktesh, Varun-TeluguStop.com

ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో ప్రముఖ కమెడియన్ అలీ కీలక పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆలీ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఎఫ్ 3 సినిమా పక్కా పైసా వసూల్ సినిమా.వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే 300 రూపాయలు ఆనందం పొందుతారు.

ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అలీ తెలిపారు.తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో తన పాత్ర దాదాపు 45 నిమిషాల పాటు ఉంటుందని, నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అలీ వెల్లడించారు.

Mehreen, Sonal Chauhan, Tamanna, Tollywood, Varun Tej, Venaktesh-Movie

ఈ సినిమాలో నా పాత్ర వడ్డీకి తిప్పే క్యారెక్టర్, ఈ సినిమాలో ఆడవాళ్ళ అంటే అపారమైన గౌరవం ఉండే పాత్ర ఆ విషయం సినిమా ఎండింగ్ లో అర్థమవుతుంది అంటూ ఈ సినిమా గురించి అలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ సినిమాకి దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా వ్యవహరించారు.ఇందులో తమన్నా సోనాల్ చౌహాన్ ,మెహరీన్, హీరోయిన్లుగా నటించగా పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.

ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube