ప్రోమోలతో చీటింగ్‌.. మరో లెవల్‌ కు వెళ్లిన జబర్దస్త్‌

ప్రోమోలతో చీటింగ్‌.. మరో లెవల్‌ కు వెళ్లిన జబర్దస్త్‌

గత వారం జబర్దస్త్‌ ప్రోమోలో రష్మి పెళ్లి జరిగినట్లుగా చూపించారు.పెళ్లి కొడుకు మొహం ను పూలతో కవర్‌ చేయడంతో ఎవరు ఆ పెళ్లి కొడుకు అంటూ ఎపిసోడ్‌ కోసం ఎంతో ఆసక్తిగా చూశారు.

 Extra Jabardast Promo Rashmi Goutham Marriage Viral , Flim News, Extra Jabardast-TeluguStop.com

నిన్న శుక్రవారం ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యింది.కాని రష్మి పెళ్లికి సంబంధించి ఎలాంటి స్కిట్‌ లేదు.

ప్రోమోలో పెట్టి ఎపిసోడ్‌ లో లేదు ఏంటా అంటూ అంతా జుట్టు పీక్కుకున్నారు.అసలు రష్మి పెళ్లి ఎవరితో అయ్యింది.

ఆ స్కిట్‌ ను ఎందుకు తొలగించారు అంటూ చర్చించుకుంటున్న సమయంలో అసలు విషయాన్ని మెల్లగా రివీల్‌ చేశారు.మల్లెమాల వారు వచ్చే శుక్రవారం ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఆ ప్రోమోలో మళ్లీ రష్మి పెళ్లికి సంబంధించిన విజువల్స్ వేశారు.

గత వారం ప్రోమోలో ఎలా ఉన్నాయో అచ్చు అలాగే వేశారు.

వచ్చే వారం రావాల్సిన ఎపిసోడ్‌ కు సంబంధించిన విజువల్స్ ను కావాలని… క్యూరియాసిటీ పెంచే ఉద్దేశ్యంతో గత వారం ప్రోమోలో వేశారు.ఈ విషయమై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎపిసోడ్‌ ను లాగేందుకు ఇలాంటి సిల్లీ ట్రిక్స్ వాడటం ఏంటీ అంటున్నారు.ఇప్పటికే ప్రోమోల్లో ఉన్నంత మ్యాటర్‌ ఎపిసోడ్‌ లో ఉండటం లేదు.

కనుక ఎపిసోడ్‌ ను చూసేవారు చాలా తక్కువ మంది అవుతున్నారు.ఇలాంటి సమయంలో ఇలా ప్రోమో చీటింగ్ ను మరో లెవల్‌ కు తీసుకు వెళ్లి ప్రేక్షకులను బకరాలుగా చేస్తే బాగోదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా జబర్దస్త్‌ వారు ఇలాంటి చీటింగ్‌ ప్రోమోలను ఆపేస్తే బాగుంటుంది అంటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఇంతకు వచ్చే వారం అయినా రష్మీ పెళ్లికి సంబంధించిన స్కిట్‌ ఉంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube