విట‌మిన్ డి లోపం వారిలోనే అధిక‌మ‌ట‌.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారేమో చూసుకోండి!

విట‌మిన్ డి లోపం వారిలోనే అధిక‌మ‌ట‌.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారేమో చూసుకోండి!

విట‌మిన్ డి.మ‌న శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇది ఒక‌టి.

 Do You Know Who Is More Likely To Be Vitamin D Deficient? Vitamin D, Vitamin D D-TeluguStop.com

బాడీలో విట‌మిన్ డి స‌మృద్ధిగా ఉంటే మ‌ధుమేహం, క్యాన్స‌ర్, గుండె పోటు వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్ గా త‌యారవుతుంది.బ‌రువు అదుపులో ఉంటుంది.

మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే విట‌మిన్ డితో చాలా ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి.

ఇక శరీరం సూర్యకాంతికి గురైనప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా విట‌మిన్ డి ని పొందొచ్చు.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు.అసలు విట‌మిన్ డి లోపం ఎవ‌రిలో అధికంగా ఉంటుంది అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

లివ‌ర్, కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డేవారు ఎక్కువ‌గా విట‌మిన్ డి లోపానికి గ‌ర‌వుతుంటారు.

Tips, Latest, Vitamin-Telugu Health Tips

అలాగే ఎప్పుడూ శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచే దుస్తుల‌ను ధ‌రించే వారు, నిత్యం ఇంట్లోనే ఉండేవారు త‌ర‌చూ విట‌మిన్ డి లోపం బారిన ప‌డుతుంటారు.ఇంట్లోనే ఉండే వారికి, శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచే దుస్తుల‌ను ధ‌రించే వారికి సూర్యరశ్మి స‌రిగ్గా త‌గ‌ల‌దు.అందుకే వారిలో విట‌మిన్ డి లోపం ఏర్పడుతుంది.

ఇక ఊబకాయులు, వృద్ధులు, సన్ స్క్రీన్ ను ఓవ‌ర్‌గా యూస్ వారు సైతం విట‌మిన్ డి లోపానికి గుర‌వుతుంటారు.ఈ లిస్ట్ లో మీరు గ‌నుక ఉంటే త‌ప్ప‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఎక్కువ శాతం విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది.కాబట్టి చర్మానికి రోజూ సూర్యరశ్మి తగిలేటట్టుగా ఉండాలి.

చేపలు, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పెరుగు, పుట్ట గొడుగులు, ఆవు పాలు, చీజ్, బ‌ట‌ర్‌, సెరల్స్, ఓట్ మీల్ వంటి ఫుడ్స్ ద్వారా కూడా విట‌మిన్ డి పొందొచ్చు.అందువ‌ల్ల‌, ఈ ఆహారాలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube