మెగాస్టార్ ఘరానా మొగుడు ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

మెగాస్టార్ ఘరానా మొగుడు ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక విధమైనటువంటి స్టైల్ ఉంటుంది.ఈ క్రమంలోనే ఫలానా హీరో పేరు చెప్పగానే అతని స్టైల్ లో అతనిని అనుసరిస్తూ అభిమానులు కూడా సందడి చేస్తుంటారు.

 Megastr Chiranjeevi Gharana Mogudu Movie Collections, Chiranjeevi, Tollywood Her-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు ఏ విధమైనటువంటి స్టైల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తారు.

ఇలా చిరంజీవి నటన డాన్స్ డైలాగ్ డెలివరీ ఎంతో విభిన్నంగా ఉండటంతో సినిమా సినిమాకు ఈయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక మెగాస్టార్ కెరియర్లో ఎన్నో రికార్డులు సృష్టించిన సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు.

అలా రికార్డులు సృష్టించిన వాటిలో ఘరానా మొగుడు సినిమా ఒకటి.అప్పట్లో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సృష్టించిందో ఎన్ని రికార్డులను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇందులోని పాటలు చిరు డైలాగ్ డెలివరీ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.తమిళంలో రజనీకాంత్ నటించినటువంటి మన్నన్ రీమేక్ చిత్రంగా ఘరానా మొగుడు చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఇందులో చిరంజీవి రావు గోపాల్ రావు కనిపించినప్పుడు నమస్తే మాస్టారు అంటూ అతని విష్ చేసే విధానం అప్పట్లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

Chiranjeevi, Gharana Mogudu, Tollywood-Movie

కేవలం ఈ డైలాగ్ మాత్రమే కాకుండా ఇందులో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ వారి వ్యక్తిత్వం గురించి చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.కొంతకాలం పాటు ఈ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ట్రెండ్ అవుతూ వచ్చాయి.ఇలా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఇందులో బంగారు కోడిపెట్ట అనే పాట యూత్ ను బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు.

Chiranjeevi, Gharana Mogudu, Tollywood-Movie

ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పదికోట్ల షేర్స్ రాబట్టుకున్న సినిమాగా ఘరానా మొగుడు రికార్డులు సృష్టించింది.తమిళం నుంచి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తిరిగి తమిళంలో డబ్ అవ్వడం విశేషం.సినిమా చరిత్రలోనే ఇలా ఏ సినిమా కూడా రీమేక్ అయిన భాష నుంచి తిరిగి డబ్ అవడం జరిగి ఉండదు.

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో రజనీకాంత్ నటించిన విషయం తెలిసిందే.అలాంటి రజనీకాంత్ ఈ సినిమా చూసి తిరిగి ఈ సినిమాను నేను రీమేక్ చేసిన వందరోజుల గ్యారెంటీగా ఆడుతుందని కామెంట్ చేయడంతో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలిసిపోతుంది.

ఈమధ్య కాలంలో ఈ విధమైనటువంటి మ్యానరిజం ఉన్నటువంటి సినిమాలు రాలేదనే చెప్పాలి.

Chiranjeevi, Gharana Mogudu, Tollywood-Movie

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత ఈయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నేటి తరం హీరోలకు పోటీగా సినిమాలో నటిస్తున్నారు.ఈయన నటించిన ఆచార్య సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవే కాకుండా మరో రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube