బరువు తగ్గడంలో ఓట్స్ ఏవిధంగా ఉపయోగపడుతాయో తెలుసా...?

ఈ మధ్య కాలంలో చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ ను తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు ఓట్స్ లో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.

అంతే కాదు అనేక రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి పదార్థాలు మనకు లభిస్తాయి.కాకపోతే మనకు బయట లభించే ఇన్స్టంట్ ఓట్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన రకానికి చెందినవి.

వీటిని వండుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతున్న చివరికి దాన్ని రెడీ చేసిన తర్వాత ఒక ముద్దగా ఏర్పడుతుంది.మామూలుగా ఓట్స్ ను ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఓట్ మీల్ గా చేసుకొని తీసుకొనే వారు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయారు.

ఇక ఈ ఓట్స్ మీల్ ను పాలలో గాని, నీళ్ళలో గాని కలిపి ఉడకబెట్టుకొని తయారు చేసుకుంటారు.ఈ ఓట్ మీల్ తయారయ్యాక దానిని వివిధ రకాల ప్రొడక్ట్స్ తో కలిపి తినడానికి ఇష్టపడతారు.

Advertisement

అయితే ఈ ఓట్స్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ గా ఎంచుకోవడానికి గల కారణం ఇది ఆకలిని తీర్చే ఒక మంచి ఫుడ్ ఐటమ్ అని చెప్పవచ్చు.దీనిని తీసుకోవడం ద్వారా ఫైబర్ అలాగే ప్రోటీన్ ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి లభిస్తుంది.

దీంట్లో అనేక పోషకవిలువలు ఉండడం ద్వారా కడుపు పూర్తిగా నిండినట్లు అనిపిస్తుంది.అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అతి తక్కువ క్యాలరీలు మాత్రమే చేసుకోగలము.

దీంతో లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ఈ ఓట్స్ మీల్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ ఓ హార్మోన్ ను విడుదల చేస్తుంది.

ఈ హార్మోన్ మన శరీరంలో ఆకలిని కంట్రోల్ చేయడానికి ఎంతగానో సహకరిస్తుంది.దీంతో ఆకలి వేస్తుందన్న ఆలోచనే దరిదాపుల్లోకి రాదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు...
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ.....

కాబట్టి శరీరం లోకి క్యాలరీలను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడం.ఇలా చేయడం ద్వారా ఒబిసిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

ఈ ఓట్స్ లో ఉండే అనేక రకాల న్యూట్రిషినల్ బెనిఫిట్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.వీటితో తయారుచేసిన మీల్ తీసుకోవడం ద్వారా శరీరం బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు