ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా.. బంగ్లాదేశ్ లో కూడా రీమేక్ అయ్యింది తెలుసా?

ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా.. బంగ్లాదేశ్ లో కూడా రీమేక్ అయ్యింది తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ గా బెస్ట్ నటుడిగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.అంతేకాదు కథల ఎంపికలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

 Do You Know About Jr Ntr Movie Which Remaked In Bangaladesh , Jr Ntr , Jr Ntr Mo-TeluguStop.com

అయితే చూడాలని ఉంది అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు అనే విషయం తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్ మనవడు గా పరిచయమైన ఒక సాదాసీదా హీరోగానే కొనసాగుతున్న సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మంచి హిట్ ను ఇచ్చింది.

ఇక ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా ఎన్టీఆర్ స్టార్ హీరో రేసులో లోకి వచ్చేశాడు.

ఆ తర్వాత రాజమౌళి మరోసారి సింహాద్రి సినిమా తీసి మాస్ ప్రేక్షకులు అందరూ ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టేలా చేశాడు.

వెంటనే వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబ సినిమా ఇక ఎన్టీఆర్ ను స్టార్ హీరోని చేసింది.రాజమౌళి వివి వినాయక్ లతో వరుస సినిమాలు చేసి హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్.

అయితే సాధారణంగా తెలుగు సినిమాలను కన్నడం తమిళం భాషల్లో రీమేక్ చేయడం జరుగుతూ ఉంటుంది.అలాగే జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సాంబ సినిమాను కూడా కన్నడ భాషలో రీమేక్ చేశారు.

మాండ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు.అయితే ఒక మనిషి జీవితంలో చదువుకు ఎంత ప్రాధాన్యత ఉంది అనే ఒక మంచి మెసేజ్ వచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం.

Aaadi, Grandson Sr Ntr, Jr Ntr, Samba, Simhadri, Tarak-Telugu Stop Exclusive Top

దీంతో కన్నడలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.అయితే ఈ సినిమా విషయంలో ఒక చిత్రమైన ఘటన చోటుచేసుకుంది.ఏకంగా ఈ సినిమా రీమేక్ ఎల్లలు దాటి పోయింది అని చెప్పాలి.ఏకంగా బంగ్లాదేశ్లోని బెంగాలీ భాషలో కూడా ఏక్ రోక పేరుతో సాంబ సినిమా రీమేక్ అయింది.

అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.హిందీలో కూడా ఇదే టైటిల్ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

అయితే ఇలా తెలుగులో యావరేజ్ టాక్ తో పర్వాలేదనిపించినా సాంబ సినిమా ఇతర భాషల్లో మాత్రం సూపర్ డూపర్ హిట్ కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube