ఎఫ్3 లో పవన్ కళ్యాణ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..?

ఎఫ్3 లో పవన్ కళ్యాణ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది.

 Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie, Dil Raju, F3 Movie, Pawan Kalyan-TeluguStop.com

వీరితో పాటు మరొక హీరోయిన్ సోనాలి చౌహాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.ఇకపోతే ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన విషయం తెలిసిందే.

సినిమా మే 27న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు ఆసక్తికర అప్డేట్ లను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఎఫ్‌ 3 సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తిర అప్‌డేట్‌పై ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అదేమిటంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కనిపించనున్నాడని జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.తాజాగా ఇదే విషయంపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

ఎఫ్‌ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు ఎఫ్ 3 సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు.

Dil Raju, Review, Mehreen, Pawan Kalyan, Tamanna, Tollywood, Varun Tej, Venkates

సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్‌ప్రైజ్‌ అని దిల్ రాజు తెలిపారు.పవన్‌ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ కూడా స్క్రీన్‌పై కనిపిస్తారంటూ క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

అయితే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.దీంతో ఇందులో పవన్ కళ్యాణ్ ఎటువంటి పాత్రలో కనిపించబోతున్నారు అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube