Difficulties For Bigg Boss Unexpected Demand For Costumes Only And Remuneration Is To Heigh

బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని దూసుకుపోతుంది.

అయితే బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఇకపై ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోప్రసారం చేయనున్నారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

కంటెస్టెంట్ ఎంపిక కూడా పూర్తయింది.అయితే ఇది వరకు ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక గంట మాత్రమే టెలికాస్ట్ చేసేవారు.

కానీ ఇకపై ఈ కార్యక్రమాన్ని 24 గంటలు ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎంతో అలర్ట్ గా ఉండాలనీ తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లకి కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు సమాచారం.24 గంటల పాటు కెమెరాల ముందు వీరు కనిపించడం వల్ల వీరికి భారీ మొత్తంలోనే పారితోషికం చెల్లించాల్సి వస్తుంది.ఇక పారితోషికంతో పాటు వీరి మధ్య నిర్వహించే టాస్క్ లు కూడా చాలా కఠినంగానే ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే ఈ కార్యక్రమంలో గ్లామర్ బ్యూటీలు పాల్గొనడం వల్ల వీరు మాత్రం మరికొంత ఎక్కువగానే పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమం 24 గంటల ప్రసారం కావడంతో ఈ ముద్దుగుమ్మలు గ్లామర్ గా కనిపించడం కోసం కాస్ట్యూమ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొందరు కంటెస్టెంట్ లు కాస్ట్యూమ్స్ కోసమే లక్షల్లో పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు రోజుకు పాతిక వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే ఇలా ఈ సీజన్లో పాల్గొనే వారికి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుతుందని తెలుస్తోంది.

- Difficulties For Bigg Boss Unexpected Demand For Costumes Only And Remuneration Is To Heigh telugu-title:బిగ్ బాస్ కు కష్టాలు.కాస్ట్యూమ్స్ కోసమే ఊహించని డిమాండ్.చుక్కల్లో పారితోషికం? Read More ??https:/telugustop.com/?p=1915886 - Telugu Movies #TeluguMovie #Tollywood #TollywoodNews #TeluguMovieNews #Telugu #TeluguStop | Movie #BiggBoss #Telugu #Movie Channel:Telugu Movies .