చంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారా?

చంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారా?

రాజకీయ పార్టీ అన్న తర్వాత బడా నేతల నుంచి ఛోటా, మోటా నేతల వరకు అందరినీ పరిగణనలోకి తీసుకోవాలి.గ్రౌండ్ లెవల్‌లో చిన్న పనులు చేసే కార్యకర్తలే పార్టీల గెలుపులో కీలకంగా వ్యవహరిస్తారు.

 Did Jagan Show What Chandrababu Could Not Do Details, Andhra Pradesh, Chandraba-TeluguStop.com

వాళ్లను పట్టించుకోకపోతే పార్టీ క్యాడర్ యాక్టివ్‌గా ఉండే పరిస్థితులు ఉండవు.ఇటీవల ఏపీలో టీడీపీ ఈ సంగతిని విస్మరించింది.

ముఖ్యంగా దివ్యవాణి విషయంలో టీడీపీ చిక్కులను ఎదుర్కొంది.ఆమె తనకు అవమానం జరిగిందంటూ గగ్గోలు పెట్టింది.

వాస్తవంగా చూస్తే మహానాడు వంటి పెద్ద వేదికపై ఓ కుర్చీ వేసి దివ్యవాణిని కూర్చోబెడితే టీడీపీకి పెద్దగా పోయేదేమీ ఉండదు.కానీ ఇక్కడ సమస్య చిన్న, పెద్ద అంటూ నేతలను వేర్వేరుగా చూడటమే.

చంద్రబాబు ఈ విషయంలో తప్పు చేశారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపించాయి.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటలో జగన్ వైసీపీలో చిన్న నేతలను కూడా నవ్వుతూ పలకరించారు.

గతంలో వైఎస్ఆర్ తరహా రాజకీయాన్నే జగన్ ఆచరణలో చేసి చూపిస్తున్నారు.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టూర్‌లో వైసీపీలో చిన్న నేతల నుంచి విజ్ఞాపనలు విన్నారు.

వారితో సీఎం జగన్ విసుగు చెందకుండా ఫొటోలు దిగారు.ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకుల కన్నా ఈసారి చోటా మోటాలే సీఎం జగన్ సభలోనూ హెలిప్యాడ్ దగ్గర మిగిలిన చోట్లా సందడి చేశారు.

Andhra Pradesh, Chandrababu, Cm Jagan, Killi Kruparani, Srikakulam, Tdp Mahanadu

చిన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వంటి నేతలను కూడా జగన్ పట్టించుకోలేదు.ఈ విషయంలో జగన్ మంచి మార్కులే కొట్టేశారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి సీఎం జగన్ శ్రీకాకుళం టూర్ మొత్తం ఇదే విధంగా సాగింది.ఒక్క ప్రొటోకాల్ వివాదం తప్పించి మిగతా వ్యవహారమంతా హాయిగానే సాగిపోయింది.ఇది అధికార పార్టీ కార్యక్రమమా లేదా ప్రభుత్వ కార్యక్రమమా అన్న డౌట్ కూడా చాలా మందికి వచ్చింది.ముఖ్యంగా శ్రీకాకుళం నగర నాయకులు చాలా మంది సీఎం జగన్‌తో మాట్లాడేందుకు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

అటుమున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్‌లను కూడా ఆయన పేరు పేరునా పలకరించి వెళ్లారు.ముఖ్యంగా మహిళా నాయకులు జగన్ ఆశీర్వాదాలు తీసుకునేందుకు పాదాభివందనాలు చేస్తే వద్దని వారించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube