గారెలు,వడలు డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే... బెస్ట్ చిట్కా

డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే.సాధారణంగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ని తినాలని కోరిక ఉంటుంది.

కానీ బరువు పెరుగుతామని డీప్ ఫ్రై ఐటమ్స్ తినకుండా కట్టడి చేసుకుంటాం.కానీ ఈ చిట్కాని ఫాలో అయితే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినవచ్చు.

గారెల పిండి మిక్సీ చేసిన 5 నిమిషాల లోపే గారెలను వేసుకుంటే నూనె పీల్చవు.

బొబ్బట్లు విడిపోకుండా మెత్తగా,రుచిగా రావాలంటే.సాధారణంగా బొబ్బట్లు చేసేటప్పుడు విడిపోతూ ఉంటాయి.

ఆలా విడిపోకుండా ఉండాలంటే పిండి కలుపుకొనే సమయంలో కొంచెం నూనె వేయాలి.అలాగే పిండిని అరగంట నానబెట్టాలి.

బొబ్బట్టులో స్టఫింగ్ చేసుకొనే పూర్ణం బాగా మెత్తగా ఉండాలి.శనగపప్పును బాగా ఉడికించి ఆరబెట్టి పంచదార లేదా బెల్లం కలిపి మిక్సీ చేయాలి.

ఇలా చేస్తే బొబ్బట్టు విడిపోకుండా మెత్తగా,రుచిగా వస్తుంది.రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా ఉండాలంటే.

ఉప్మా చేసినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఉండ కడుతూ ఉంటుంది.ఆలా ఉండ కట్టకుండా ఉండాలంటే రవ్వలో కొంచెం నెయ్యి లేదా నూనె వేసి వేగించి ఆ తర్వాత ఉప్మా చేసుకుంటే ఉండ కట్టదు.

బియ్యంలో మట్టి గడ్డలు ఎక్కువగా ఉంటే బియ్యంలో ఒక స్పూన్ ఉప్పు వేసి అరగంట నానబెడితే మట్టి గడ్డలు కరిగిపోతాయి.

చపాతీ పిండిలో గోరువెచ్చని నీటిని పోసి కలిపితే చపాతీలు మృదువుగా వస్తాయి.వడియాలు తెల్లగా రావాలంటే వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం పిండాలి.

గారెలు కరకరలాడుతూ ఉండాలంటే గారెల పిండిలో కొంచెం సేమ్యా కలపాలి.రాగి వస్తువులను చింతపండు లేదా నిమ్మరసంలో ఉప్పు కలిపి తోమితే మిలమిల మెరుస్తాయి.

బెండకాయ కొనలను కట్ చేసి కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

వంకాయ ముక్కలు కోసిన వెంటనే నల్లగా మారిపోతాయి.ఆలా కాకుండా ఉండాలంటే వంకాయ ముక్కలను కోసే నీటిలో ఒక స్పూన్ పాలను చేర్చాలి.

కూరలో కారం ఎక్కువ అవ్వటం సహజమే.అలాంటి సమయంలో కంగారు పడనవసరం లేదు.

కూరలో కొన్ని టమోటా ముక్కలు వేసి ఉడికిస్తే సరిపోతుంది.కాలిఫ్లవర్ కూర వంగినప్పుడు రంగు మారుతూ ఉంటుంది.

ఆలా మారకుండా తెల్లగా ఉండాలంటే కూర వండే సమయంలో 2 స్పూన్ల పాలను పోయాలి.

అరటికాయ ముక్కలు కోసిన వెంటనే నల్లబడి పోతూ ఉంటాయి.అదే బియ్యం కడిగిన నీటిలో అరటికాయ ముక్కలను కొస్తే నల్లబడవు.

ప్రభాస్ హను రాఘవ పూడి సినిమాలో నటించనున్న యంగ్ హీరో…