ఆచార్య వల్లే ఇప్పుడు చిరు యాక్టివ్ గా లేరా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తేలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా చిరు కెరిర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Chiranjeevi Is Not Active Because Of Acharya Movie What Actually Happened Chiranjeevi, Tollywood, Acharya Movie, Social Media , Surekha , Ram Chran, Pooja Hegdhe-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.ప్రేక్షకులు, అభిమానులు ఊహించని విధంగా ఈ సినిమా భారీగా డిజాస్టర్ ను చవిచూసింది.

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన సినిమా, అలాగే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు,అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

 ఆచార్య వల్లే ఇప్పుడు చిరు యాక్టివ్ గా లేరా.. అసలేం జరిగిందంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విడుదలైన నాలుగు రోజులకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నాలుగు రోజులకే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది.

సినిమా విడుదలైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో కూడా అయింది.సినిమా విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ తో కలిసి హాలిడే ట్రిప్ కోసం ఫారిన్ వెళ్ళిన విషయం తెలిసిందే.

తన భార్య సురేఖ తో కలసి అమెరికా యూరప్ పర్యటనకు వెళ్లినట్లు తానే స్వయంగా సోషల్ అయితే అప్పటి నుండి మెగాస్టార్ ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయారు.సాధారణంగా చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే.

తరచుగా ఏదో ఒకటి విషయం గురించి అప్డేట్లు ఇస్తూ ఉండే చిరు ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.అంతే కాకుండా ఆచార్య సినిమా కారణంగా ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరు పై ట్రోలింగ్స్ జరిగాయి.

Acharya, Chiranjeevi, Pooja Hegdhe, Ram Chran, Surekha, Tollywood-Latest News - Telugu

కొరటాల కథలో చిరు వేలు పెట్టడం వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి.ఇక ఈ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.దీన్ని దర్శకుడు కొరటాల ఒక్కరే ఫేస్ డీల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే విదేశీ పర్యటన నుండి చిరంజీవి ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఎటువంటి అప్డేట్ లేదు.

సీనియర్ హీరో లైన్ లో పెట్టిన వివిధ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ పెండింగ్ లో ఉన్నాయి.ఆ సినిమాలు మల్లి ఎప్పుడు మొదలైవుతుంది అనేది కూడా తెలియడం లేదు.

మెగా అభిమానులు మాత్రం వీలైనంత తర్వాత చిరు తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఆచార్య పరాభవాన్ని మరిచిపోయేలా చేయాలని కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube