ఐ ఫోన్ పేరుతో ఆశ పెడుతున్న ముఠా.. చిక్కితే అంతే సంగతులు

ఐ ఫోన్ పేరుతో ఆశ పెడుతున్న ముఠా.. చిక్కితే అంతే సంగతులు

టెక్నాలజీ పెరగడంతో ఎన్నో సేవలు మనం వినియోగించుకుంటున్నాం.ఒకప్పుడు ఎవరికైనా సందేశం పంపాలంటే పోస్టు కార్డు ద్వారానో, టెలిగ్రామ్ ద్వారానో పంపాల్సి వచ్చేది.

 Cheating In The Name Of I Phone Hyderabad Police Arrest 8 Members Details, Iphon-TeluguStop.com

ఇప్పుడైతే ఆ అవసరం లేదు.స్మార్ట్ ఫోన్స్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయాయి.

చిన్న సందేశం ఏదైనా పంపాలన్నా వాట్సాప్‌లో చకచకా మెసేజ్ చేసేస్తున్నారు.చదువు తక్కువగా ఉన్న వారు సైతం ఎంతో సులువుగా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు.

ఇల్లు తుడవడానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి ఇలా అన్నింటికీ ప్రస్తుతం మెషీన్లు ఉన్నాయి.పెరిగిన టెక్నాలజీతో మోసాలు కూడా పెరుగుతున్నాయి.

లాటరీ, లోన్, గిఫ్ట్స్ ఇలా ఏవో ఒకటి ఆశ చూపి సులువుగా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.

తాజాగా అలాంటి ఒక దాని గురించి పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఐ ఫోన్ అంటే చెవి కోసుకుంటారు.అత్యంత ఖరీదైన ఈ ఫోన్ అందరికీ అందుబాటులో ఉండదు.

అయితే ఇలాంటి ఫోన్ పేరుతో కొందరు కేటుగాళ్లు లింకులు పంపుతున్నారు.ఒక ఐ ఫోన్ కంటే మరో ఐఫోన్ ఫ్రీ అంటూ వల విసురుతున్నారు.

దీని నమ్మి, ఆ లింక్ క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తే వెంటనే ఐ ఫోన్ పంపుతామని భారీ ఆఫర్ ఇచ్చారు.

Links, Hyderabad, Iphone, Latest-Latest News - Telugu

దీంతో నిజమే అని నమ్మి కొందరు ఆ కళ్లు చెదిరే ఆఫర్‌కు ఆకర్షితులయ్యారు.వెంటనే డబ్బు చెల్లించారు.ఇలా చాలా మంది నుంచి ఆ కేటుగాళ్ల ముఠా డబ్బులు లాక్కుంది.ఆ తర్వాత పరారైంది.మోసపోయిన బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.చివరికి హైదరాబాద్ పోలీసులు ఆ దొంగల ముఠాను పట్టుకున్నారు.మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

ఇలాంటి ఫేక్ డిస్కౌంట్లకు మోసపోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube