ఆడపిల్లలు అడిగారని గేర్ రాడ్డు చేతిలో పెట్టాడు,రిస్క్ లో పడ్డాడు

టూరిజం బస్సు లో బస్సు డ్రైవర్ చేసిన పనికి ఏకంగా తన ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు.

కేరళ నుంచి గోవా వెళుతున్న టూరిజం బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాలేజీ అమ్మాయిలు ప్రయాణిస్తున్న ఆ బస్సులో వారి కన్ను గేర్ రాడ్డు పై పడడం తో డ్రైవర్ వెనకాలే వెళ్లి డ్రైవర్ ను మాటల్లో పెట్టి గేర్ రాడ్డును మేం ఆపరేట్ చేస్తాం ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశారు.అయితే వారి కోరికకు తొలుత ఆశ్చర్యపోయి వారి వైపు బిత్తర చూపులు చూసిన డ్రైవర్ ఆ తరువాత ఏమనుకున్నాడో గానీ సరదా పడుతున్నారు కదా అని వారి చేతిలో గేర్ రాడ్డు ను పెట్టాడు.

డ్రైవర్ ఎలా చెబితే అలా వాళ్లు గేర్ రాడ్డును ఆపరేట్ చెయ్యలేదు సరికదా వాళ్లకు నచ్చినట్టుగా తిప్పసాగారు.దీనితో అది గమనించిన డ్రైవర్ మధ్యమధ్యలో తనే గేర్ సెట్ చేస్తూ ముందుకుసాగాడు.

ఇందుకు సంబంధించిన వీడియో కాస్త పేస్ బుక్ లో ప్రత్యక్షమవ్వడం తో ఆ వీడియో కాస్త వైరల్ మారింది.దీనితో ఈ సమాచారం చేరాల్సిన వారికి చేరడం తో ఆర్ టీ ఓ అధికారులు స్పందించి వెంటనే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటూ సస్పెండ్ చేశారు.డ్రైవర్ పేరు షాజీ అని,

Advertisement

అతను కేరళలోని వాయనాడ్‌కు చెందినవాడు అని అధికారులు తెలిపారు.మొత్తానికి బస్సు డ్రైవర్ అమ్మాయిల సరదా తీర్చడం కోసం ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టాడు అని చెప్పాలి.దీనితో ఆగ్రహించిన అధికారులు పై మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి ...

Advertisement

తాజా వార్తలు