ఈ మధ్య బ్రహ్మానందం నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోందని అంతా ఆయన్ని ఆడిపోసుకుంటున్నారు.గత సంవత్సరం వచ్చిన ఆగడు నుంచి మొదలు, దాదాపుగా ప్రతి సినిమా ఫ్లాపే.
ఇక ఈ మధ్య వచ్చిన బ్రూస్ లీ, అఖిల్ నుంచి ఈ విమర్శలు మరీ ఎక్కువైపోయాయి.ఇంకెన్ని సినిమాల్లో బ్రహ్మానందం బకరా కామెడి చేస్తాడని ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు.
ఇదే విషయంపై ఒక అంగ్ల వెబ్ సైట్ తో మాట్లాడిన బ్రహ్మానందం ” సినిమా అడకపోతే నన్నెందుకు అనటం? ఒకేలా చేస్తున్నాను అంటే ఆ తప్పు నాది కాదు.నా దగ్గరికి ఒకే రకమైన పాత్రలతో వస్తున్నారు దర్శకులు, రచయితలు.
వాళ్లు కథ చెబుతున్నప్పుడే నాకు తెలుసు ఇది నేను చాలా సినిమాల్లో చేసిందే అని, కాని నా పాత్ర మార్చేయండి అని నేను వాళ్ళకి చెప్పలేను కదా! ఒక దర్శకుడు ఎలా చెబితే నేను అలానే చేయాలి.
ఇక విమర్శకులు ఎప్పుడూ ఉంటారు.
ఇన్నేళ్ళుగా నవ్వించాను, శరీరం సహకరిస్తున్నంత వరకు నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.నా వల్ల ఒక సినిమా ఆడదు, అలాగే నా వల్ల ఒక సినిమా ఫ్లాప్ అవదు ” అంటూ ఫైర్ అయ్యారు బ్రహ్మి.
ప్రస్తుతం బెంగాల్ టైగర్, సరైనోడు, సోగ్గాడే చిన్ని నాయన, సర్దార్ గబ్బర్ సింగ్, కృష్ణాష్టమి తదితర చిత్రాల్లో నటిస్తున్నారు బ్రహ్మానందం.