నటి శ్రీదేవి వీపుపై బోనీ కపూర్ పేరు.. ఈ పేరు వెనుక అసలు కథ ఇదే!

దక్షిణాది భాషలతో పాటు తెలుగులో కూడా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు.శివకాశిలో జన్మించిన శ్రీదేవి చిన్న వయస్సులోనే నటిగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.1996 సంవత్సరం జూన్ నెల 2వ తేదీన శ్రీదేవి బోనీ కపూర్ ల వివాహం జరిగింది.తమిళ, మలయాళ సినిమాలలో కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Boney Kapoor On Tuesday Shared An Old Picture Of Sridevi, Boney Kapoor, Sridevi, Tollywood , Bollywood, Kollywood-TeluguStop.com

తాజాగా శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో శ్రీదేవి తన వీపుపై కుంకుమతో బోనీకపూర్ అనే అక్షరాలను రాయించుకున్నారు.

ఈ ఫోటో 2012 సంవత్సరంలో దిగిన ఫోటో అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు.దుర్గా పూజ సంబరాల సమయంలో దిగిన ఫోటో ఈ ఫోటో అని బోనీ కపూర్ కామెంట్లు చేశారు.

 నటి శ్రీదేవి వీపుపై బోనీ కపూర్ పేరు.. ఈ పేరు వెనుక అసలు కథ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూపీలోని లక్నోలో ఉన్న సహారా సహర్ ప్రాంతంలో దిగిన ఫోటో ఈ ఫోటో అని బోనీ కపూర్ వెల్లడించారు.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫోటోలో శ్రీదేవి చాలా అందంగా ఉన్నారని కామెంట్లు చేశారు.కొందరు నెటిజన్లు శ్రీదేవి రూప్ కా రాణీ అని కామెంట్లు చేయగా మరి కొందరు నెటిజన్లు శ్రీదేవి మన మధ్య లేరనే నిజాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.మరి కొందరు నెటిజన్లు శ్రీదేవి వీపుపై బోనీ పేరును ఎవరు రాశారని ప్రశ్నించారు.

Bollywood, Boney Kapoor, Kollywood, Picture, Sridevi, Tollywood-Movie

2018 సంవత్సం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి మృతి చెందారు.శ్రీదేవి సినీ కెరీర్ లో ఎన్నో కీలక పాత్రలను రిజెక్ట్ చేశారు.బాహుబలి సిరీస్ లోని శివగామి పాత్రకు మొదట శ్రీదేవి ఎంపిక కాగా కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను శ్రీదేవి వదులుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube