సీమలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. మరి వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా...

సీమలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. మరి వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా…

ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రాయలసీమ ప్రాంత వాసులు మాత్రం ఎప్పటికీ వైసీపీకే మద్దతుగా ఉంటారు.సీమ రాజకీయాలు ఎల్లప్పుడూ వైసీపీకే సొంతం.2014 ఎన్నికల్లో ఇక్కడ కొంచెం టీడీపీ సత్తా చాటినా కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ టీడీపీని పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది.ఇప్పుడు కూడా ఇక్కడ టీడీపీ అంత బలంగా లేదని టాక్ నడుస్తోంది.

 Bjp Is Looking To Impose In Seema And Ycp Is Looking At Silent , Bjp, Ycp ,-TeluguStop.com

అక్కడ టీడీపీకి ఉన్న నాయకులు కూడా పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ కారణం చేతే అక్కడ టీడీపీ పరిస్థితి రోజురోజుకీ తీసి కట్టుగా తయారవుతోందని అనుకుంటున్నారు.

ఇలా ఉండగా.సీమలో పాగా వేసేందుకు బీజేపీ పార్టీ కూడా సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ అక్కడ అంత స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీ కమలం పార్టీ ఎత్తులను చిత్తు చేయకుండా ఊరుకుంటుందా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ అనే ముద్ర ఎప్పటి నుంచో ఉంది.

ఈ ముద్రను తుడివేసుకోవడానికి ఆ పార్టీ ఎంత ప్రయత్నించినా కానీ లాభం లేకుండా పోతుంది.బీజేపీ చేసే రాజకీయాలు కూడా మతతత్వ రాజకీయాల్లాగానే అనిపిస్తున్నాయి.ఈ ఆంశం అప్పుడప్పుడూ పార్టీకి మైనస్ అవుతోంది.అప్పుడప్పుడు ప్లస్ అవుతోంది.

తాజాగా ఈ నెల 22 న రాయలసీమలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాషాయ పార్టీ చూస్తోంది.ఈ సభ ద్వారా బీజేపీ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతోంది.ఇదిలా ఉండగా.బీజేపీ నేతలు కూడా సీమ మీద గట్టిగానే ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు అనేక మంది అగ్రనాయకులు ఈ మధ్య రాయలసీమలో పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు.మరి సీమలో కాషాయ జెండా ఎగరేయాలనే బీజేపీ కోరిక తీరుతుందో లేదో 2024 ఎన్నికల్లో తేలనుంది.

BJP Is Looking To Impose In Seema And YCP Is Looking At Silent , BJP, Ycp , Tdp ,rayalaseema , Somu Verraju ,politices - Telugu Rayalaseema, Somu Verraju

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube