సన్నీ లియోన్ పేరుపై పెద్ద మోసం.. గుర్తుతెలియని వ్యక్తికి అప్పు!

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినిమాలలో బోల్డ్ పాత్రలలో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఐవీఎల్ సెక్యూరిటీస్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా ఉన్నఫలంగా వీరిపై హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే సన్నీలియోన్ పాన్ కార్డు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తి అప్పు తీసుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.ప్రతిరోజు ఈ విధమైనటువంటి పొరపాట్లు మోసాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి ఈ క్రమంలోనే సన్నీలియోన్ పాన్ కార్డు పై గుర్తు తెలియని వ్యక్తి రెండు వేల రూపాయలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్న సన్నీలియోన్ .ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు ఆధారంగా రెండు వేల రూపాయలు తీసుకొని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ ఏ మాత్రం సహాయం చేయక పోవడమే కాకుండా ఇండియాబుల్స్ దీన్ని  ఏ విధంగా అనుమతిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

Big Scam In The Name Of Sunny Leone Debt To An Unknown Person Details-Telugu Tre

ఇక ఈ ట్వీట్ క్షణాలలో వైరల్ గా మారింది.అయితే ఈ ట్వీట్ చేసిన కొంత సమయానికి సన్నీలియోన్ డిలీట్ చేయడం గమనార్హం.ఈ విధంగా ఈ ట్వీట్ డిలీట్ చేసిన వెంటనే మరో ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ లో ఐవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపింది.‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు ధన్యవాదాలు.

 ఇంత వేగంగా నా సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటూ మరో ట్వీట్ చేశారు.

అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ విధమైనటువంటి పొరపాట్లు జరగడం సర్వసాధారణం అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది.కానీ ఈలోపే సన్నీ లియోన్ తొందరపడి ఐవీఎల్ సెక్యూరిటీస్ ను విమర్శించడం సరైనది కాదు అంటూ పలువురు ఈమెపై విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

- Big Scam In The Name Of Sunny Leone Debt To An Unknown Person Details telugu-title:సన్నీ లియోన్ పేరుపై పెద్ద మోసం.గుర్తుతెలియని వ్యక్తికి అప్పు! Read More ??https:/telugustop.com/?p=1915868 - Telugu Movies #TeluguMovie #Tollywood #TollywoodNews #TeluguMovieNews #Telugu #TeluguStop | Movie #Actress #BigScame #Bollywood #FilmIndustry #MoneyDebt #PANCard #SunnyLeone #UnknownPerson #Movie Channel:Telugu Movies .

ఎట్టకేలకు నెరవేరిన చిరంజీవి పెద్ద కూతురు కోరిక.. ఆ సినిమాతో సక్సెస్ సాధిస్తారా?...