ఒకడి మోచేతి నీళ్లు తాగను అంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్?

ఒకడి మోచేతి నీళ్లు తాగను అంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను నిత్యం రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.

 Bandla Ganesh On Relation With Tollywood Heroes Details, Bandla Ganesh, Directo-TeluguStop.com

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానో మనకు తెలిసిందే.బండ్ల గణేష్ వ్యవహార శైలి ఎవరికి కూడా అంత త్వరగా అర్థం కాదు.

అతను ఎప్పుడూ ఎలా ఉంటాడో ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది అంచనా వేయలేం.ఇటీవలే ఒక సారి తన కెరీర్లో ఇక రాజకీయాలు ఉండవు, జీవితం అంతా కూడా సినిమాలే అని చెప్పిన బండ్ల గణేష్, మరొకసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తాను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాను, పవన్ కళ్యాణ్ నా దేవుడు నాకు మరో అవకాశాన్ని ఇచ్చాడన్న బండ్ల గణేష్ ఇప్పుడు ఆయన్ని నేను అడగలేదు అని అంటున్నాడు.అంతేకాకుండా అసలు ఇప్పుడు సినిమాలను నిర్మించే ఉద్దేశ్యమే లేదని ఖరాఖండిగా చెప్పేశాడు.

హీరోలతో రిలేషన్ గురించి కూడా మాట్లాడాడు.హీరోలను దేవుడిలా పూజించాలని .వారు బాగుంటేనే సినిమా బాగా వస్తుందని .అందరూ బాగుంటారని మొదట్లో అన్నాడు.ఆ తరువాత హీరోలు ఏమైనా దేవుళ్లా అని అన్నాడు.

Bandla Ganesh, Hyderabad, Pawan Kalyan, Heroes, Tollywood-Movie

నేను సినిమాలు చేస్తే దేవుళ్లలా చూసుకుంటాను.లేకపోతే లేదు.నా జీవితమే సినిమా కాదు.

నా జీవితంలో సినిమా ఓ పార్ట్.అలాగే చిన్నప్పుడు అతనికి అతని నాన్న ఒక మాట చెప్పాడట.

హైదరాబాద్ వెళ్తాను నాన్న అంటే అతని నాన్న వద్దు అనగా తల్లి వెళ్లమని చెప్పిందట.ఆ సమయంలో నాన్న ఓ మాట చెప్పాడు.

వెళ్తే వెళ్లు.మంచి పేరు తెచ్చుకో.

ఆకలేస్తే కులాయి నీళ్లు అయినా తాగు కానీ ఒకడి మోచేతి నీళ్లు మాత్రం తాగకు అని చెప్పాడు.అదే పాటిస్తున్నాను.

నన్ను ఎవరైనా ప్రేమిస్తే నేను తిరిగి ప్రేమిస్తా.నన్ను ద్వేషిస్తే నేను కూడా ద్వేషిస్తాను.

అది ఎవరైనా సరే అని బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube