చేతికట్టుతో మూడో ఎపిసోడ్ కి సిద్దమైన బాలయ్య బాబు.. ప్రోమో వైరల్!

Balayya Babu Ready For The Third Episode With A Hand Bandage Promo Viral

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అని టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం దీపావళి కానుకగా ప్రారంభమైంది.

 Balayya Babu Ready For The Third Episode With A Hand Bandage Promo Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిథిగా వచ్చి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.అదేవిధంగా రెండవ ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని అతిథిగా హాజరై బాలకృష్ణతో కలిసి ఎన్నో ముచ్చటించారు.

అయితే ఈ కార్యక్రమం రెండు ఎపిసోడ్ లతో ఆగిపోయింది.అందుకు గల కారణం బాలకృష్ణ భుజానికి సర్జరీ కావడం చేత మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ కార్యక్రమం కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.

 చేతికట్టుతో మూడో ఎపిసోడ్ కి సిద్దమైన బాలయ్య బాబు.. ప్రోమో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా బాలకృష్ణ మరోసారి ఈ టాక్ షో ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు నిర్వాహకులు ప్రోమో వదిలారు.

ప్రోమోలో భాగంగా బాలకృష్ణ చేతికట్టుతోనే వేదికపైకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ ప్రోమోలో బాలకృష్ణ మాట్లాడుతూ మూడు వారాలు గ్యాప్ రావడంతో చాలామంది ఎన్నో ఫోన్స్ మెసేజ్లు చేస్తున్నారని అయితే మీ ఆరోగ్యం ఎలా ఉందని కాకుండా ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ మెసేజ్లు చేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

మరి మూడవ అతిథిగా ఈ కార్యక్రమానికి ఎవరు రానున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

#Promo #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube