నువ్వు కూడా అలాంటి సినిమా తీయాలి బాబు..!

నువ్వు కూడా అలాంటి సినిమా తీయాలి బాబు..!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా విక్రం.కమల్ తో పాటుగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిక్ లు కూడా నటించారు.

 Babu Fans Wanted Vikram From Mahesh , Fahad Fazil , Kamal Hassan, Lokesh Kanagar-TeluguStop.com

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.సినిమా 400 కోట్ల దాకా వసూళ్లని రాబట్టింది.

ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ సైతం కమల్ నటన.లోకేష్ డైరక్షన్ టాలెంట్ ని పొగిడారు.లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కూడా విక్రం సినిమాని పొగుడుతూ వరుస ట్వీట్స్ చేశారు.

కమల్ నటన గురించి.

లోకేష్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.అంతేకాదు ఇదొక కల్ట్ క్లాసిక్ అని కూడా చెప్పారు మహేష్.

అయితే మహేష్ చేసిన ట్వీట్స్ చూసి అటు కమల్ హాసన్ ఫ్యాన్స్ తమిళ ఆడియెన్స్ ఖుషి అవుతున్నారు.అయితే మహేష్ చేసిన ట్వీట్స్ పై సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ వెరైటీగా స్పందిస్తున్నారు.

మహేష్ నువ్వు ఇలాంటి సినిమాలను పొగుడుతావ్ కానీ నువ్వు చేయవ్ అని అంటున్నారు.ఈ సినిమాలను చూసి మెచ్చుకునే నువ్వు సర్కారు వారి పాట, మహర్షి లాంటి సినిమాలు చేస్తావని మహేష్ పై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

మంచి సినిమా ఏదొచ్చినా సరే మహేష్ నుంచి ఓ ట్వీట్ వస్తుంది.ఈ క్రమంలో మహేష్ విక్రం సినిమాపై చేసిన కామెంట్స్ ఆయనకే రివర్స్ కొడుతున్నాయి.అయితే మహేష్ కూడా అలాంటి స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేస్తే చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉన్నారు.కానీ మహేష్ మాత్రం ఆ కథలను ఎందుకో వద్దని అంటున్నాడు.

మరి మహేష్ ఇక మీదట అయినా విక్రం లాంటి సినిమాలను చేస్తాడేమో చూడాలి.మహేష్ విక్రం సినిమాపై వేసిన ట్వీట్ పై వస్తున్న వెరైటీ కామెంట్స్ కి అందరు అవాక్కవుతున్నారు.

ఈ హడావిడిలో లోకేష్ తో మహేష్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఆ కాంబో ఫిక్స్ అయితే మాత్రం అరుపులే అంటూ చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube