జగన్ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన మాజీ కేంద్ర మంత్రి..!!

జగన్ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన మాజీ కేంద్ర మంత్రి..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాల పట్ల ప్రతిపక్షాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఏపీ భవిష్యత్తుకు సంబంధించి మూడు రాజధానుల బిల్లు విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి సమగ్రమైన బిల్లుతో త్వరలో రానున్నట్లు.

 Ashok Gajapatiraju Serious Comments On Jagan , Ashok Gajapatiraju, Ys Jagan-TeluguStop.com

.సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో ప్రసంగించారు.

ఇటువంటి తరుణంలో మూడు రాజధానులు విషయంలో జగన్ వ్యవహార శైలిపై తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

కాగా తాజాగా మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతిరాజు కూడా జగన్ వ్యవహార శైలిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్టణం అని.కాస్త సుందరీకరణ చేస్తే.ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలలో హైదరాబాద్ తో పోటీ పడే అవకాశం ఉందని జగన్.నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అశోక్ గజపతిరాజు సెటైర్లు వేశారు.

ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే విశాఖ పట్టణంలో ఉన్న భవనాలకు రంగులు వేస్తే సరిపోతుంది అన్నట్టు ఉందని అన్నారు.అభివృద్ధి అంటే రంగులు వేయడం కాదు అని కౌంటర్ ఇచ్చారు.

దీంతో రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత.మరింత ఏర్పడుతుందని మిగతా రాష్ట్రాలు ముందుకు వెళ్లిపోతాయని మన రాష్ట్రం వెనుకబడి పోతుంది అని.జగన్ చేసిన వ్యాఖ్యలను అశోక్ గజపతిరాజు ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube