మీరు పానీపూరీ ప్రియులా? అక్కడ దాన్ని బ్యాన్ చేసారు​.. ఎందుకో తెలిస్తే, జన్మలో ఇక తినరు?

మీరు పానీపూరీ ప్రియులా? అక్కడ దాన్ని బ్యాన్ చేసారు​.. ఎందుకో తెలిస్తే, జన్మలో ఇక తినరు?

ఇక్కడ పానీపూరీని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి? అందుకే మీరు ఈ స్టేట్మెంట్ ని విని కంగారు పడవచ్చు.కానీ ఇది నిజం.

 Are You A Panipuri Lover  It Was Banned There , Pani Puri , Banned , Viral Lates-TeluguStop.com

అక్కడ పూర్తిగా దాన్ని బ్యాన్ చేసారు.అక్కడ వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పూర్తిగా నిషేధం విధించారు అధికారులు.

అయితే ఆ నిషేధిత జాబితాలో ఎక్కువమంది అమితంగా ఇష్టపడే పానీపూరీ ఉండటం గమనార్హం.ఇంతకీ దీనిని అక్కడ ఎందుకు, ఎక్కడ బ్యాన్​ చేసారో తెలియాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే.

నేపాల్ రాజధాని అయినటువంటి ఖాట్మండ్ లోగల లలిత్‌పుర్ అనే ప్రాంతంలో పానీపూరీతో పాటు పలు స్ట్రీట్​ ఫుడ్స్​ పైన తాజాగా నిషేధం విధించారు అధికారులు.విషయం ఏమంటే, ఆ ప్రాంతంలో ఎక్కువగా కలరా వ్యాధి విజృభిస్తోంది.

ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.గత వారం రోజులుగా లలిత్‌పుర్​లో కలరా కేసులు భారీగా నమోదువుతుండగా.

తాజాగా ఆ వ్యాధి ఖాట్మండ్ కు కూడా వ్యాపించింది.ఆదివారం నుంచి ఇప్పటివరకు కాఠ్​మండూ పరిధిలో 12 కలరా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Nepal, Cholera, Kathmandu, Lalitpur, Pani Puri, Panipuri Lover, Latest-Latest Ne

ఈ నేపథ్యంలో అక్కడ వ్యాధిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై.ఆంక్షలు విధిస్తున్నారు.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా కలరా వ్యాపిస్తుందనే విషయం అందరికీ తెలిసినదే.

ఇది ఒక అంటు వ్యాధి.కలరా సోకిన వారికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు అవుతాయి.చికిత్స చేయకుండా వదిలేస్తే.గంటల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.అందుకే మొగ్గ దశలో ఉన్నప్పుడే వ్యాధిని కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube