న్యూస్ రౌండప్ టాప్ - 20

1.మరోసారి నిలిచిన మెట్రో ట్రైన్ సర్వీస్ లు

హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల సర్వీసులు మరోసారి నిలిచిపోయాయి.మెట్రో స్టేషన్ లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడతో అరగంట పాటు ట్రైన్ లు నిలిచిపోయాయి. 

2.ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్.భారీ బందోబస్తు

  ఈ నెల 26 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

3.కోర్టు ఆదేశాల తో ఆర్జీవీ పై చీటింగ్ కేసు

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold Rate , Cm Kcr, Cm Jagan Mohan Reddy, Minister Mallareddy, Tpcc Revanth Reddy, Ys Sharmila , Pm Narendra Modi ,qutub Minar, Bjp, Kanna Lakshmi Narayana, Narayana-TeluguStop.com

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.దిశ ఎన్ కౌంటర్ పై సినిమా చేస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తన వద్ద 56 లక్షల అప్పు గా తీసుకున్నాడు అంటూ మియాపూర్ మాతృశ్రీ నగర్ కు చెందిన శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్ నిర్వాహకుడు శేఖర్ రాజు ఫిర్యాదు చేశారు. 

4.రాజ్యసభ రాష్ట్రపతి ఎన్నికలు.బిజెపి ముఖ్య నేతల భేటీ

  రాజ్యసభ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు సోమవారం సమావేశమయ్యారు. 

5.వర్సిటీల్లో బోధన పోస్టులు భర్తీ చేయాలి : షర్మిల

 

తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీ ల్లో ఖాళీ గా ఉన్న 1869 బోధన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. 

6.అచ్చెన్నాయుడు విమర్శలు

 టిడిపి మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

7.మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

 

 న్యూస్ రౌండప్ టాప్ #8211; 20-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పదో తరగతి ప్రశ్నా పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ పై విచారణను చిత్తూరు జిల్లా కోర్టు వాయిదా వేసింది. 

8.జగన్ పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

 

ఇగో ఇజం, శాడిజం, ఫ్యాక్షనిజం వ్యక్తి జగన్ అని  బీజేపీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 

9.ఏపీ సచివాలయం వద్ద సిపియస్ ఉద్యోగుల నిరసన

  ఏపీ సచివాలయం రెండు బ్లాక్ ఎదుట సి.పి.ఎస్ ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. 

10.జగన్ పాలన పై ఉండవల్లి విమర్శలు

  జగన్ పరిపాలన లో ఏపీకి ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. 

11.కుతుబ్ మినార్ ను దేవాలయంగా మార్చలేం

 

కుతుబ్ మినార్ ను దేవాలయం గా మార్చడం కుదరదు అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 

12.వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ

  ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

13.శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ఆగస్టు నెల కోట విడుదల

 

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ ఇవాళ ఆన్లైన్ లో విడుదల చేసింది.ఆగస్టు నెల కు సంబంధించిన తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ ఆగస్టు నెల టికెట్ల కోటాను విడుదల చేసింది. 

14.సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు

  తాను హిందువునే అయినప్పటికీ , అవసరమైతే బీఫ్ తింటానని కర్ణాటక మాజీ సీఎం , కాంగ్రెస్ నేత సిద్దిరామయ్య సంచలన ప్రకటన చేశారు. 

15.మంత్రిని తొలగించిన పంజాబ్ సీఎం

 

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను తొలగిస్తూ పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. 

16.కేటీఆర్ జగన్ భేటీ

 ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ దావొస్ లో జరిగిన మీటింగ్ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. 

17.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1675 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.సర్వీస్ చార్జి వసూలుపై రెస్టారెంట్లకు కేంద్రం మార్నింగ్

  వినియోగదారుల నుంచి సర్వీస్ చార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేయడం పై కేంద్రం సీరియస్ అయ్యింది.మేరకు రెస్టారెంట్లకు హెచ్చరికలు జారీ చేసింది. 

19.రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి కామెంట్స్

 

టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అడుగడుగున బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,750   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,090  

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube