న్యూస్ రౌండప్ టాప్ 20

న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మాస్క్ లేనివారికి 1000 రూపాయలు జరిమానా విధించనున్నారు .

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.కేసిఆర్ పై షర్మిల విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.ఆర్టీసీ నష్టాల బాట పడుతున్న  , గట్టెక్కించ లేని స్థితిలో

కే

సిఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

3.రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్న గుడ్ గాడ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 520 ఖాళీలు ఉన్నాయి.

4.వరద బాధితులకు జగన్ భరోసా

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు.కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పుల పుత్తూరులో బాధితులతో జగన్ మాట్లాడారు.వారందరికీ జగన్ ధైర్యం చెబుతూ తాను ఉన్నానని అన్నివిధాలా ఆదుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు.

5.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముద్రగడ లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

6.32వ రోజు కొనసాగుతున్న మహా పాదయాత్ర

అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 32 వ రోజుకి చేరుకుంది.

7.వాక్సిన్ వేయించుకోని వారికి నో ఎంట్రీ

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

ఇక వాక్సిన్ వేయించుకొని వారికి బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఈ మేరకు కఠిన నిబంధనలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

8.ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్

కాంగ్రెస్ పార్టీ గడిచిన పదేళ్లలో 90% ఎన్నికల్లో ఓటమి చెందిందని, ఇక ఆ పార్టీ నాయకత్వం ఒకే వ్యక్తికి చెందిన దైవ హక్కుగా భావిస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశారు.

9.పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్లమెంటులో రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు.

10.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.వరద బాధితులకు అల్లుఅర్జున్ విరాళం

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

ఏపీలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా  ఎంతో ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకుంది .దీనికి స్పందించిన సినీ హీరో అల్లు అర్జున్ తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు విరాళం ప్రకటించారు.

12.నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల ప్రమాణ స్వీకారం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకరం చేశారు.

13.ఏపీకి మరో తుఫాన్ ముప్పు

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

14.ఏపీలో తుఫాను.రైళ్లు రద్దు

ఏపీలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మూడు రోజులపాటు తూర్పు కోస్తా పరిధిలోని అనేక రూట్ల లో రైళ్లను రద్దు చేశారు.

15.కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

నవంబర్ 22న కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు , రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు.

16.కొండపల్లి మున్సిపల్ ఫలితం పై చంద్రబాబు సమీక్ష

ఇటీవల జరిగిన కొండపల్లి , జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఫలితాలపై టిడిపి అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

17.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతి

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

తెలంగాణలో సినిమా టికెట్ ధరను పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది.

19.వల్లభనేని వంశీ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం

Allu Arjun, Ap Telangana, Ap Cm, Ap Floods, Covid Vaccine, Telangana, Gold, Top-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కమ్మ సంఘం నేత నా లేక ఎమ్మెల్యే నా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై అరికెపూడి గాంధీ స్పందించారు.వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలని , తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ గాంధీ వ్యాఖ్యానించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,120

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,120

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube