అలాంటి సీన్స్ లో నటిస్తే మా ఆయన ఫీల్ అవుతాడు.. నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎన్నో హిందీ సీరియల్స్ సినిమాల ద్వారా అందరికీ సుపరిచితమైన బాలీవుడ్ నటి అంకిత లోఖండే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె అందరికీ సుపరిచితమే.ఈమె ఎన్నో విజయవంతమైన సీరియల్స్ లో నటించడమే కాకుండా వెండితెరపై పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు సందడి చేసింది.

 Ankita Lokhande Says I Dont Want To Hurt My Husband Details, Ankitha Lokhande, Bollywood, Vicky Jain, Marriage, Actor Vicky Jain, Pavitra Rishta Serial, Bollywood Actress, Actress Ankita Lokhande-TeluguStop.com

ఇదిలా ఉండగా అంకిత దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి గతంలో ‘పవిత్ర రిష్తా’  సీరియల్ లో నటించిన ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే ఈ సీరియల్ రెండవసీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తన కెరీర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.ఈమె కొన్ని సంవత్సరాల నుంచి నటుడు విక్కీ జైన్‌ను ప్రేమించిన అనంతరం వివాహం చేసుకున్నారు.

 అలాంటి సీన్స్ లో నటిస్తే మా ఆయన ఫీల్ అవుతాడు.. నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి.

ఎలాంటి పాత్రలలో నటించాలి అనే విషయంలో కొన్ని నియమాలను పెట్టుకున్నానని ఆ నియమాలను మార్చడం ఎవరి వల్ల కాదు అని తెలిపారు.

Vicky Jain, Actressankita, Bollywood, Pavitrarishta-Movie

ఈ క్రమంలోనే తను ఏ విధమైనటువంటి బోల్డ్ సన్నివేశాలలో నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈమె తెలిపారు.ఈ విషయంలో ఎవరు తన మనసును మార్చలేరని ఇలాంటి సన్నివేశాల్లో నటించడం వల్ల తన భర్త విక్కీ జైన్ బాధపడతారని, ఆయన బాధ పడుతున్నట్లు బయటకు చెప్పకపోయినా తన బాధ పడటం తాను చూడలేనని ఈమె తెలిపారు.అందుకే ఇలాంటి పాత్రల్లో నటించి మా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తనకు ఇష్టం లేకపోవడం వల్లే బోల్డ్ సన్నివేశాలలో నటించనని నటి అంకిత ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube