టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకరు.ఈయన తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
అంతేకాదు ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో పవన్ ఫ్యాన్స్ లో కూడా నితిన్ సినిమాలు అంటే క్రేజ్ ఉంది.నితిన్ కెరీర్ స్టార్టింగ్ లో అన్ని హిట్ సినిమాలు తీసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
వరుస ప్రేమ కథ సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన ఆ తర్వాత తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు.చాలా ఏళ్ల పాటు నితిన్ నటించిన సినిమాలు అన్ని కూడా వరుస ప్లాప్స్ అయ్యాయి.
అయినా కూడా ఈయన ప్రయత్నం మానకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.అలా నితిన్ వరుస సినిమాలు చేసి ఇప్పుడు హిట్స్ అందుకుంటున్నాడు.
నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఆగష్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక నితిన్ నుండి చాలా రోజుల తర్వాత ఒక మాస్ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా మాచర్ల నియోజకవర్గం నుండి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.ఇందులో ఐదవ సాంగ్ ఐటెం సాంగ్ అని తెలుస్తుంది.ఈ సాంగ్ లో చిందేయడం కోసం తెలుగమ్మాయి అంజలి ని తీసుకున్నట్టు టాక్.
ఈమె లుక్ ను తాజాగా రివీల్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ పోస్టర్ లో అంజలి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను ఎలా డిజైన్ చేసారో వేచి చూడాల్సిందే.