డబ్బులిస్తే అంటూ బిగ్ బాస్ షోపై యాంకర్ రవి కామెంట్స్ వైరల్?

డబ్బులిస్తే అంటూ బిగ్ బాస్ షోపై యాంకర్ రవి కామెంట్స్ వైరల్?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేషన్ జరిగింది.టాప్ 3 లో ఉంటాడు అనుకున్నా రవి కనీసం టాప్ 5 కి కూడా చేరుకోకుండా ని ఎలిమినేట్ అయ్యారు.

 Anchor Ravi Sensational Comments On Trolls And Memes Bigg Boss  5 Telugu Details-TeluguStop.com

ఈ విషయం పై రవి ఫ్యాన్స్ బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే రవి ఎలిమినేషన్ ని మాత్రం ఎవరు కూడా ఊహించలేకపోయాడు.

ఇదిలా ఉంటే యాంకర్ రవి బిగ్ బాస్ టీమ్ పై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత  తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చాడు రవి.ఎలిమినేషన్ తరువాత మొదటిసారిగా షో గురించి కామెంట్ చేశాడు.బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటి బయటకు చూపించేది ఒకటని రవి తెలిపారు.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో తాను చేసింది ఒకటే అయితే బయటకు మాత్రం ఇంకోలా ప్రొజెక్ట్ చేశారు అంటూ రవి తెలిపాడు.బిగ్ బాస్ ఇంట్లో ఆట ఒక ఎత్తు అయితే బయట జరిగేది మరొక ఎత్తు.

బయట ఆటను మరోలా ప్రొజెక్ట్ చేసే ట్రోల్ మీమ్స్ ఎక్కువయ్యాయి.

కంటెస్టెంట్ లను ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు.అది తప్పు అని నేను అనను, కానీ నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్లే ముందు చెప్పాను.ట్రోల్స్ మీమ్స్ ఏవైనా ఉంటే నన్ను ఇష్టమొచ్చినట్టు వాడుకోండని చెప్పాను.

కానీ నా ఫ్యామిలీ జోలికి వచ్చారు నా భార్య పై ట్రోల్స్ చేశారు.చివరకు మా పాప మీద కూడా! ఒక బ్యాచ్ ఉంది వారిని ఏమనాలో కూడా తెలియడం లేదు.

వాళ్లకు 2000 రూపాయలు ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా ట్రోల్స్ చేస్తారు అంటూ రవి తన బాధను పంచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube