పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడుతున్న అరియానా.. ఏమైందంటే?

పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడుతున్న అరియానా.. ఏమైందంటే?

బిగ్ బాస్ షో ద్వారా భారీస్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో అరియానా ఒకరు అనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్4, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షోలలో పాల్గొన్న అరియానా ఈ రియాలిటీ షోల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించారు.

 Anchor Ariyana Glory Marry Me Reel With Anchor Siva Gone Viral , Anchor Shiva , Ariyana , Remuneration, Marriage Video , Ariyana Glory , Movie Offers , Bigg Boss Season 4, Bigg Boss Telugu Ott Show-TeluguStop.com

టీవీ షోలకు యాంకర్ గా ఆఫర్లు వస్తున్నా అరియానా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.తాజాగా అరియానా యాంకర్ శివతో కలిసి ఒక రీల్ చేయగా ఆ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.

శివ, అరియానా మ్యారీ మీ రీల్ చేయగా ఈ రీల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.లేడీ అబ్బాయితో ఉంగరంను తొడిగించుకుని పెళ్లి చేసుకోవాలని కోరే ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడుతున్న అరియానా.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రీల్ లో తనను పెళ్లి చేసుకోవాలని అరియానా కోరగా శివ మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.బిగ్ బాస్ హౌస్ లో అరియానాతో శివ పులిహోర కలపడానికి ప్రయత్నించగా అరియానా ఆ సమయంలో సీరియస్ గా వ్యవహరించడంతో శివ వెనక్కు తగ్గారు.

అరియానా గ్లోరీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ రీల్ ను రిలీజ్ చేయగా ఈ రీల్ వైరల్ అవుతోంది.అరియానా, శివ కలిసి ఇప్పటికే వంటలకు సంబంధించిన వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అరియానా గ్లోరీకి సినిమా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా గుర్తింపు రాని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.అరియానా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అరియానా పరిమితంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.రియాలిటీ షోలతో బిజీ అయితే అరియానాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

అరియానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube