చికాకు పెట్టేలా నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగేలా ఆనంద్ మహీంద్రా ఆన్సర్!

చికాకు పెట్టేలా నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగేలా ఆనంద్ మహీంద్రా ఆన్సర్!

ఆనంద్ మ‌హీంద్రా… పరిచయం అక్కర్లేని ఓ బ్రాండ్.మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ ఎల్లప్పుడూ ట్విట‌ర్‌లో యాక్టివ్‌గా కనిపిస్తారు.

 Anand Mahindra Shocking Reply To Netizen Who Asks About Qualification Details, A-TeluguStop.com

తనకు నచ్చిన ఫన్నీ క్యాప్షన్లు, వీడియోలు, మీమ్స్‌, వైర‌ల్ ఫొటోల‌ను షేర్ చేస్తూ వుంటారు.ముఖ్యంగా యువ‌త‌ను స్ఫూర్తినింపే వీడియోల‌ను ఎక్కువగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ వుంటారు.

లోక‌ల్ టాలెంట్‌, చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తారు.వీటితోపాటు త‌న ఫాలోవ‌ర్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా, చ‌మ‌త్కారంగా స‌మాధానాలు ఇస్తుంటారు.

తాజాగా, ‘మీ అర్హ‌తేంట‌’ని ఓ ఫాలోవ‌ర్ అడిగినదానికి ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు.

దాంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అయింది.

మనకు తెలిసిందే, ఆ మధ్య “నాకు ప‌దివేల లోపు కారు కావాలి.మీరు విక్ర‌యించ‌గ‌ల‌రా?” అని ఒక నెటిజన్ ప్రశ్నించగా దీనికి సమాధానంగా ఆనంద్ మ‌హీంద్రా అమెజాన్‌లో అమ్మ‌కానికి పెట్టిన బొమ్మ థార్‌కారు ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసినదే.తాజాగా, ఓ యూజ‌ర్ ‘మీ విద్యార్హ‌తేంటి?’ అని ప్ర‌శ్నించారు.దీనికి ఆనంద్ మ‌హీంద్ర అదిరిపోయే రిప్లయ్ ఇచ్చారు.“వాస్త‌వంగా చెప్పాలంటే నా వయస్సులో ఏ మెరిట్‌కైనా ఏకైక అర్హత అనుభవం మాత్ర‌మే!” అని ఆన్స‌ర్ ఇచ్చి నెటిజన్లను ఆకర్శించారు.

Anadh Mahindra, Anand Mahindra, Anandmahindra, Latest, Netizen, Respond, Respons

దాంతో ఈ సమాధానం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.ఇప్ప‌టివ‌ర‌కూ దీన్ని 6700 మంది లైక్ చేయ‌గా, 372 మంది రీట్వీట్ కూడా చేశారు.ఈ కౌంట్ ఇంకా పెరుగుతూ పోతోంది.

ఆనంద్ ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, సోషల్ వర్కర్ కూడా.తనకు నచ్చిన విషయం గురించి అతడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

అవసరమైన ఎడల ఎవరన్నా సహాయం కోరినా కూడా నిస్సంకోచంగా సహాయం చేస్తాడు.అందుకే ఆనంద్ ఇపుడు ఒక యూత్ ఐకాన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube