అమెరికాలో డిగ్రీ చదివిన తండ్రి... అదే కాలేజ్‌లో 75 ఏళ్ల తర్వాత మెడల్ అందుకున్న ఆనంద్ మహీంద్రా..!!

అమెరికాలో డిగ్రీ చదివిన తండ్రి… అదే కాలేజ్‌లో 75 ఏళ్ల తర్వాత మెడల్ అందుకున్న ఆనంద్ మహీంద్రా..!!

భారతీయ కార్పోరేట్ దిగ్గజాల్లో మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒకరు.వ్యాపార వ్యవహారాల్లో నిత్యం బిజీగా వుండే ఆయన… సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వుంటారు.అంతేకాదు.దేశంలోని పలు సమస్యలను, తన దృష్టికి వచ్చిన అంశాలను ఆనంద్ ప్రస్తావిస్తూ వుంటారు.తాజాగా తన జీవితానికి సంబంధించిన విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు.అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లాండ్ డిప్లొమసీ నుంచి తాను డీన్స్ మెడల్ పొందినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

 Anand Mahindra Honoured By Us College Where His Father Harish Was 1st Indian Gra-TeluguStop.com

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.

ఈ సందర్భంగా తన తండ్రి హరీశ్ మహీంద్రా గురించి ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

‘‘ తన తండ్రి 75 ఏళ్ల క్రితం బోస్టన్‌లోని ఫ్లెచర్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన తొలి భారతీయుడు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంలో .స్కూల్ క్లాస్ డేలో ప్రసంగించి, డీన్ మెడల్ అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచానని’’ మహీంద్రా ట్వీట్ చేశారు.తన తండ్రి తరపున డీన్ మెడల్ అందుకున్నందుకు సంతోషంగా వుందని ఆయన పేర్కొన్నారు.

Anandmahindra, Harish Mahindra, Fletcherschool, Indian-Telugu NRI

ఇకపోతే.టఫ్ట్స్ యూనివర్శిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్‌ ఆఫ్ లా అండ్ డిప్లొమసీలో అంతర్జాతీయ వ్యవహారాలను బోధిస్తుంటారు.అమెరికాలోని ప్రతిష్టాత్మక, పురాతన విద్యాసంస్థల్లో ఇదీ ఒకటి.ఫ్లెచర్ స్కూల్‌లో అందించే గ్రాడ్యూయేట్, డాక్టోరల్ కోర్సులకు మంచి గుర్తింపు వుంది.అన్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మే 24న షేర్ చేసిన ఈ పోస్ట్‌ని దాదాపు 14,000 మంది లైక్ చేశారు.

అదే సమయంలో ఆయనపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube