దొరికిన 1969 నాటి ఓ పాత లెటర్.. అందులో జూమ్ కాల్, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రస్తావన?

మనదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి గురించి చదివినవారికి, విన్నవారికి ఓ విషయం గురించి బాగా తెలిసే ఉంటుంది.

అది వీరబ్రహ్మంగారి భవిష్యత్ దర్శనం గురించి.

అంటే అతను చెప్పిన భవిష్యవాణి అక్షరాలా నిజం.ఇప్పటికీ అతని చెప్పిన వింతలు, ఆచారాలు జరుగుతున్నాయని అంటూవుంటారు.

అలాగే ప్రపంచంలో అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటాం.సరిగ్గా అలాంటి ఘటన గురించే ఇపుడు మాట్లాడుకుంటున్నాం.

ఆమె దాదాపు 53 ఏళ్ల క్రితమే ఇప్పటి మనుషుల జీవన విధానం గురించి ఓ ఉత్తరంలో పొందుపరిచిందట.ఇలాంటివి పట్టణాల్లో ఎక్కువగా వెలుగు చూస్తాయి.

Advertisement

సాధారణంగా పట్టణాల్లో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ బయటపడుతూ ఉంటాయి.అంతకుముందు అక్కడున్నవారు వదిలేసిన వస్తువుల్లో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా కనిపిస్తుంటాయి.

ఇలాంటి అనుభవమే UKకు చెందిన రోసా బెకర్టన్‌కు ఎదురైంది.తన భర్త పీటర్ సోఫాను కదిలించినప్పుడు దొరికిన లెటర్ ఆమెను విస్మయానికి గురిచేసింది.

వెంటనే ఆ విషయాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రోసాకు దొరికిన 50 ఏళ్ల కిందటి ఓల్డ్ లెటర్‌లో భవిష్యత్తు గురించి ప్రస్తావన ఉందట.ఆ లెటర్ ఫిబ్రవరి 23, 1969న స్కూల్ ప్రాజెక్ట్‌ కోసం రాసినది కాగా.అప్పటికే 11ఏళ్లు వయసున్న అమ్మాయి 1980కి వచ్చేసరికి ఎలా ఉంటుందో అందులో రాసిపెట్టుకుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు...
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ.....

ఆ టైమ్ కి తనకు పెళ్లి అయిపోతుందని, బ్యాంక్ ఎంప్లాయిగా తను ఆఫీసులో పనిచేస్తుంటే భర్త మాత్రం ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడని చెప్పుకొచ్చింది.ఇక భర్తకు కాఫీ ప్రిపేర్ చేసిద్దామంటే.

Advertisement

కుదరదని, చూయింగ్ గమ్‌‌ నమిలితే ఆ ఫ్లేవర్ వచ్చే కాఫీ, టీలు మార్కెట్లో దర్శనం ఇస్తాయని చెప్పుకొచ్చింది.ఈ విషయాలు చదివిన రోసాకి దిమ్మతిరిగిందట.

తాజా వార్తలు