ఆన్‎లైన్ బోధనపై విదేశీ విద్యార్థులకు అమెరికా అంక్షలు..!  

Donald trump, online Education, america, visa, foreign students - Telugu America, Donald Trump, Foreign Students, Online Education, Visa

విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విదేశీ విద్యార్థుల విషయంలో కొత్త కొత్త మార్పులు తీసుకొస్తున్న అమెరికా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.పూర్తిగా ఆన్ లైన్ విధానంలో మాత్రమే బోధన ఎంచుకుంటున్న నూతన విద్యార్థులకు తమ దేశంలో ప్రవేశం లేదని ఉత్తర్వులు జారీ చేసింది.

TeluguStop.com - America Orders No Permission Online Classes Foreign Students

ఇప్పటికే దేశంలో ఉంటూ అన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులలు అమెరికా విడిచి పోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నూతన విధానంపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రకటన విడుదల చేసింది.

TeluguStop.com - ఆన్‎లైన్ బోధనపై విదేశీ విద్యార్థులకు అమెరికా అంక్షలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అంతకుముందు అమెరికాలో ఉంటూ ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్ధులను వెనక్కి పంపాలన్న అమెరికా సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యలు దాఖలయ్యాయి.

వీటిపై దాదాపు 200 పైగా విద్యాసంస్థలు సంతకాలు చేశాయి.హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు సైతం కోర్టును ఆశ్రయించాయి.వీరికి సాంకేతిక దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, వంటి సంస్థలు మద్దతుగా నిలిచాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ మార్చి 13న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తీసుకున్న నిర్ణయానికి ట్రంప్ తాజా ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ట్రంప్ నిర్ణయంతో ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుతున్న విద్యార్థులతో పాటు, ఎం-1 వీసాపై వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నవారు గందరగోళంలో పడ్డారు.ఎట్టకేలకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా నూతన విద్యార్థులను అనుమతించేది లేదంటూ మరో నిబంధన రావడం విమర్శల పాలవుతోంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల్ని ఎలాగైనా తెరిపించాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Donald Trump #Visa #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube